YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

గులాంకు లైన్ కు క్లియర్ అయినట్టేనా

గులాంకు లైన్ కు క్లియర్ అయినట్టేనా

గులాంకు లైన్ కు క్లియర్ అయినట్టేనా
న్యూఢిల్లీ, నవంబర్ 2,
ఏదైనా కొంత సమయం గడిస్తే అంతా అవే సర్దుకుంటాయి. కాంగ్రెస్ పార్టీలోనూ అదే జరుగుతుంది. సీనియర్ నేతలందరూ ముక్తకంఠంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిిందే. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలందరూ మూకుమ్మడిగా లేఖ రాయడం అప్పట్లో సంచలనం కల్గించింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయింది. వారిపై చర్యలకు సిద్ధమయినట్లే కన్పించినా ఆ తర్వాత వెనక్కు తగ్గింది.గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడటం హైకమాండ్ సహించలేకపోయింది. రాజ్యసభ, లోక్ సభల సమావేశాల సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై కమిటీలను నియమించి గులాం నబీ ఆజాద్ తో పాటు సీనియర్ నేతలకు చెక్ పెట్టాలని చూసింది. అయితే ఇదంతా జరిగి దాదాపు రెండు నెలలు కావస్తుంది. సీనియర్ నేతలపై పార్టీ పరంగా ఎటువంటి చర్యలు అధిష్టానం తీసుకోలేదు.పైగా బీహార్ ఎన్నికల్లో గులాం నబీ ఆజాద్ ను క్యాంపెయినర్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో జరగనుండటంతో శశిధరూర్ లాంటి నేతలను కూడా ఇప్పుడు హైకమాండ్ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక దశలో లేఖ రాసిన 23 మంది నేతలపై వేటు వేయాలని రాహుల్ గాంధీ భావించారంటారు. కానీ సోనియా సూచనతో వెనక్కు తగ్గారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ తో పాటు శశిధరూర్, కపిల్ సిబాల్, మనీష్ తివారి, ఆనందశర్మ లాంటి నేతలపై చర్య తీసుకుంటే పార్టీకే నష్టమని అధిష్టానం గుర్తించింది. ఇక సీనియర్ నేతలు సయితం తాము లేఖ లో రాసిన విషయాన్ని మర్చిపోయినట్లే వ్యవహరిస్తున్నారు. అసలు లేఖ రాసింది రాహుల్ గాంధీపై పై చేయి సాధించడం కోసం. అది నెరవేరకపోవగా తిరిగి తమ తలకే చుట్టుకోవడంతో సీనియర్ నేతలు వారి డిమాండ్ ను పక్కన పెట్టేశారు. అధిష్టానం సయితం సీనియర్ నేతలు కంట్రోల్ కావడంతో అక్కున చేర్చుకునేందుకు రెడీ అయిందనే చెప్పాలి.

Related Posts