YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

క్షయ వ్యాధి నివారణకు మిస్స్డ్ కాల్ పోస్టర్ ఆవిష్కరణ

క్షయ వ్యాధి నివారణకు  మిస్స్డ్ కాల్ పోస్టర్ ఆవిష్కరణ

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపధ్యంలో క్షయ వ్యాధి ప్రమాదకరంగా మారింది. నిరంతరం దగ్గు సాయంత్రం పూట జ్వరం ఉంటే అవి క్షయ వ్యాధి లక్షణాలు కావొచ్చు పూర్తి వివరాలకై 6366937337 కు మిస్స్డ్ ఇస్తే ఖచ్చితమైన సమాచారం మరియు ఉచిత వైద్య సేవలు పొందండి అనే వివరాలతో పోస్టర్ విడుదల చేసారు. వరంగల్ అర్బన్ జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా, ప్రజలలో సమిష్టి కృషితో చైతన్యం తీసుకువచ్చేందుకు జిల్లా వైద్యాధికారులు జిల్లా క్షయ వ్యాధి కేంద్రం హన్మకొండలో మిస్స్డ్ కాల్ పోస్టర్ విడుదల చేశారు. డిటిసిఓ పిఎసెస్ మల్లికార్జునరావు, వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ నరసింహ రాజు టీబీ అలర్ట్ ఇండియా మిస్స్డ్ కాల్ అలర్ట్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహారాజు మాట్లాడుతూ, గ్రామాలలో, పట్టణాలలో మరియు ప్రధాన కూడళ్లలో, జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించుటకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే ఫోన్ చేస్తే కచ్చితమైన సమాచారం అందిస్తామన్నారు. గ్రామంలోని ఆర్ఎంపీ లు మరియు పిఎంపీ ల వద్ద వ్యాధి లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తామని డిటీసీఓ  మల్లికార్జున్ కోరారు.

Related Posts