YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

నిండు గర్భిణికి ఆర్థిక సహాయం

నిండు గర్భిణికి ఆర్థిక సహాయం

నెల్లూరు జిల్లా కావలి నగరానికి చెందిన నిరుపేద, నిండు గర్భిణీ స్త్రీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం నాయకులు 5 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక  సంఘం ప్రధాన కార్యదర్శి చిలకపాటి మాల్యాద్రి తెలిపిన వివరాల మేరకు కావలి పట్టణానికి చెందిన రోశమ్మ కూతురు, మహాలక్ష్మి నిండు గర్భిణీ స్త్రీ ,ఆమెకి పురిటి నొప్పులు రావడంతో కావలి  ప్రజా వైద్యశాలకు  వెళ్ళడం జరిగిందన్నారు. ఇంకా  డెలివరీకి టైం పడుతుంది అని డాక్టర్లు చెప్పినప్పటికీ, ఆమెకు  నొప్పులు విపరీతంగా ఉన్నందున, నెల్లూరు ప్రజా వైద్య శాల కి  తరలించడం జరిగింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి వాళ్ళకి రావడంతో మళ్లీ తిరిగి, కావలి  ఒక ప్రైవేటు హాస్పిటల్ లో సానుకూలంగా డెలివరీ చేయడం , మగ శిశువు కి జన్మనివ్వడం జరిగింది. కాని  వారి నిరుపేద కుటుంబం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, సోషల్ మీడియాలో విషయం తెలుసుకున్న , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం నెల్లూరు జిల్లా రజక కమిటీ  ఆధ్వర్యంలో,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకపాడు మాల్యాద్రి , జిల్లా కార్యదర్శి కాకర్ల వెంకటేశ్వర్లు , కోవూరు మండల కన్వీనర్ చిత్తలూరు రామయ్య , దగధర్తి మండల సంఘం అధ్యక్షులు మన్నూరు  సుబ్బయ్య , కావలికి  చెందిన ఆటో స్పేర్ పార్ట్స్ వ్యాపారస్తులు పార్లపల్లి వెంకటేశ్వర్లు , ఆమె చికిత్స పొందుతున్న ప్రైవేట్ హాస్పిటల్ వద్దకు వెళ్లి, వాళ్ల స్థితిగతులు పరిశీలించి, వాళ్లకి 5 వేల  రూపాయలు హార్దిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  కావలి కి చెందిన రాజక నాయకులు ఎంతో ఆప్యాయత అనురాగాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం  నాయకులను ఆహ్వానించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర వహించిన చిలకపాటి మధు, చిలకపాటి మాల్యాద్రి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్
నాయకులు పెంచలయ్య  , వెంకయ్య ,కొండయ్య , పెనుబల్లి అశోక్ ,హరి తదితరులు పాల్గొన్నారు

Related Posts