YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ధాన్యం సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

ధాన్యం సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

జిల్లా, కొత్త గూడ మండలం, పోగుళ్ళ పల్లి లో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ధాన్యం సేకరణ కేంద్రాన్ని, రైతు కళ్ళాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగాసత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కొత్తగూడెంలో ని, పోగుళ్ల పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టాలని ముందే నిర్ణయించామన్నారు.రైతులంతా సంతోషం గా ఉండాలని సీఎం కేసిఆర్ ధాన్యం కళ్ళాల దగ్గరే కొనుగోలు కేంద్రాలు పెట్టి సేకరిస్తున్నారన్నారు.మక్కలు వద్దన్నా వేశారు...అయినా రైతు నష్టపోవద్దని మక్కలు కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.ధరణి పోర్టల్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములకు కూడా రక్షణ కల్పిస్తూ స్థానిక గిరిజనులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని తిలిపారు.పోడు భూములను కూడా సమగ్రంగా సర్వే చేయించి స్వయంగా తానే వచ్చి పొడుభుముల పట్టా ఇస్తానని సీఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చారన్నారుకానీ కొంతమంది.. గిరిజనుల భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి వారిని నమ్మవద్దని కోరారు.రైతును రాజు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. అందుకే పక్క రాష్ర్టంలో బీజేపీ ప్రభుత్వంలోని రైతులు ఇక్కడకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు.గతంలో రైతులు కరెంట్ మోటార్లు పట్టుకొని తిరగడానికి సమయం చాలేది..ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ ను 24 గంటలు ఇస్తూ...విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ రైతు ఇబ్బంది పడకుండా చూస్తున్నామన్నారు.తాలుగాని, తేమ గానీ లేకుండా ధాన్యం కేంద్రానికి తీసుకువస్తే మీకు మంచి ధర వస్తుంది.లక్ష కల్లాలు నిర్మించి, రైతు తన ధాన్యం ఆరబోసుకునే వసతి కల్పిస్తున్నమన్నారు.రైతులు ఒక దగ్గర చేరి, పంటల గురించి చర్చించుకునే విధంగా రైతు వేదికలు నిర్మించి ఇస్తున్నామన్నారు.రైతులందరూ కలిసి ఇక్కడ రెండున్నర ఎకరాల భూమి ఉంది గోడౌన్ ఇవ్వమన్నారు...కాబట్టి వెంటనే ఈ గోడౌన్ ఇస్తున్నామని తెలిపారు.అటవీ ఇబ్బందులను తొలగించి రోడ్లకు అనుమతులు వచ్చే విధంగా పని చేసే లైజన్ ఆఫీసర్ పెట్టి రోడ్లు వేయిస్తానని హామీ హిచ్చారు.గిరి వికాసం కింద గిరిజనుల భూములు అభివృద్ధి చేసి పంట పండించుకునే వసతులు కల్పిస్తామని,ఏజెన్సీ ప్రాంతాల్లో 3 ఫేజ్ కరెంట్ లేని గ్రామం లేకుండా చేస్తాము.గిరిజన బిడ్డగా ఈ ప్రాంత సమస్యలు నాకు తెలుసు. ఇక్కడి అన్ని సమస్యలు స్థానిక ఎమ్మేల్యే, ఎంపితో కలిసి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానన్నారు.

Related Posts