YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

v

v

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గాడిలో పడినట్లే కన్పిస్తుంది. లోకేష్ లో ఒకరకమైన కసి కన్పిస్తుంది. ధీమా కన్పిస్తుంది. ఇది చాలదా? తమ నేత ఎదగడానికి అని తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడిపోతున్నారు. ఇటీవల కాలంలో లోకేష్ లో కన్పించిన మార్పును పార్టీలోనే కాదు ప్రత్యర్థులు సయితం స్వాగతిస్తున్నారు. దాదాపు పదిహేను నెలల నుంచి పెద్దగా పార్టీని పట్టించుకోని లోకేష్ ఇప్పుడిప్పుడే మెల్లగా గాడిలో పడుతున్నారు.క్షేత్రస్థాయి పర్యటనలకు వెళుతున్నారు. అక్రమంగా కేసులు పెట్టిన వెంటనే అక్కడకు వెళ్లి లోకేష్ పరామర్శించి వస్తున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలను లోకేష్ పరామర్శించి వచ్చారు. ఇది పార్టీలో లోకేష్ ఉన్నారన్న భరోసా కల్పించనట్లవుతుందని నేతలు భావిస్తున్నారు. గతంలో మాదిరిగా లోకేష్ మాటలో కూడా చాలా మార్పు వచ్చింది. వైసీపీ ప్రభుత్వంపై సూటిగానే విమర్శలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.నిజానికి లోకేష్ ఈ పనిని ఎప్పుడో చేయాల్సింది. చంద్రబాబు వయసు రీత్యా కరోనా కారణంగా బయటకు రాలేకపోవచ్చు. కానీ లోకేష్ మాత్రం తండ్రి వెంటే హైదరాబాద్ లో ఉండి పోవడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. కానీ గత కొద్ది రోజులుగా లోకేష్ తన యాక్టివిటీని పెంచారు. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి అవకాశం లభిస్తుంది. అది ఇప్పుడు లోకేష్ కు లభించిందనే చెప్పాలి. తండ్రితోనే పార్టీ మనుగడ ఉందని పార్టీలో ఉన్న కొందరి అభిప్రాయాలనుకూడా లోకేష్ చెరిపేయడానికి ఇదే మంచి సమయం అంటున్నారు.తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ సారధి లోకేష్ మాత్రమే. ఇందులో ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. అయితే క్యాడర్ లలో, లీడర్లలో తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ పై ఉంది. ఆ దిశగానే ఇప్పుడిప్పుడే లోకేష్ అడుగులు వేస్తున్నట్లు కన్పిస్తుంది. త్వరలో అన్ని జిల్లాలను లోకేష్ పర్యటిస్తారని చెబుతున్నారు. జనంలోకి చొరవగా వెళితేనే నాయకుడు అవుతారన్న నిజాన్ని లోకేష్ తెలుసుకున్నట్లుంది. అందుకే త్వరలోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Related Posts