YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాములమ్మ...కామెంట్స్ పై టెన్షన్...

 రాములమ్మ...కామెంట్స్ పై టెన్షన్...

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి కలవరం కలిగించే ప్రకటన చేశారు. ఒకరకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకే కాకుండా అధికార trsపార్టీకి కూడా షాక్ కలిగించే ప్రకటన అది. ఆమె అలవోకగా ఆ ప్రకటన చేశారా, అన్నీబేరీజు చేసుకునే అలాంటి ప్రకటన చేశారా అన్నది అంతుబట్టటం లేదు కానీ ఒక్క షాట్‌కు రెండు పిట్టల చందాన అటు కాంగ్రెస్‌కి, ఇటు తెరాసకీ సమానంగా హెచ్చరికలు పంపారు.కాంగ్రెస్‌ నేతలు కొందరిని ప్రలోభపెట్టి, భయపెట్టి ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది అని విజయశాంతి పేర్కొన్నారు.అంతటితో వదలిపెట్టలేదామె. మరికొంత ముందుగానే టీపీసీసీ ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్‌ రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి అని విజయశాంతి వ్యాఖ్యానించారు.ఈ రెండు వ్యాఖ్యలతో రెండు తేనెతుట్టెలను ఆమె కెలికినట్లయింది. ఇటీవలే ఆమెను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కలిశారు. బీజేపీలో చేరాలని ఆహ్వానించగా తనకు సమయం కావాలని చెప్పినప్పటికీ ఆమె బీజేపీలోకి వెళ్లపోతారనే ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్‌ విజయశాంతి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, టీపీసీసీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ సైతం విజయశాంతిని ఆమె ఇంటికెళ్లి మరీ సంప్రదించారని తాజా సమాచారం. కాంగ్రెస్‌లో ఇలా పార్టీ ఇన్‌చార్జీలు వెళ్లి కలవడం చాలా అరుదు. అయితే విజయశాంతి అవసరం కాంగ్రెస్‌ పార్టీకి ఉందనే ఆలోచనతో మాణిక్యం ఈ చర్యకు ఉపక్రమించారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆమె చెప్పిన విషయాలను బట్టి విజయశాంతి కాంగ్రెస్‌లో ఉంటారనే ధీమా టీపీసీసీ నేతల్లో వ్యక్తమైంది.
కానీ తెలంగాణలో అధికార పార్టీ గత కొన్నేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని వెంటాడి మరీ తనలోకి చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో చాలామంది కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు సైతం తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అయితే తెరాస నాయకత్వం పోకడలు అసలు భరించలేని డీకే అరుణ వంటి కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిపోవడంతో కాంగ్రెస్ రెండురకాలుగా నష్టపోయింది. గత కొంతకాలంగా ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తూ వస్తున్న విజయశాంతి ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్టకట్టలేదని నిర్ణయానికి వచ్చేశినట్లు తెలుస్తోంది.
వరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని అంటూనే రాష్ట్రంలో బీజేపీ బలపడిందని ఆమె పేర్కొనడం గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కానీ వాయిదాల పద్ధతిలో విజయశాంతి విడుదల చేస్తున్న ప్రకటనలు మరో అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక రోజున ఆత్మ ప్రభోదానుసారం ఓటేయాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన విజయశాంతి... టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ హోదాలో ఉండి కూడా కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరలేదు. పైగా ఆ పోస్టింగ్‌లో తన పేరు కింద హోదాను ప్రస్తావించేందుకు కూడా ఆసక్తి చూపలేదు.కాంగ్రెస్ పార్టీలో ఇక భవిష్యత్తు లేదని పూర్తిగా స్పష్టమయ్యాకే ఆమె బీజేపీలో చేరడానికి నిర్ణయించుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Related Posts