YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బిజెపి రైతు వ్యతిరేక విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో జన జాగృతి యాత్ర

బిజెపి రైతు వ్యతిరేక విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో జన జాగృతి యాత్ర

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు, దళితులపై దాడులు, మైనార్టీలపై కక్షపూరిత వైఖరి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తోందని వీటిని ఖండించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి రెండు మౌనంగా ఉన్నాయని, దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని,అందుకోసం సిపిఎం పార్టీ గా రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు ఈ దినం కౌతాళం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మోటార్ బైక్ యాత్రను సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లయ్య, సిపిఎం మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ కౌతాళం మండలం లో ఈరోజు బంటకుంట, సులేకేరి, మదిరే, పొదలకుంట, కాత్రి కి, లింగాలదిన్నె, అగసాల దిన్నె, డబ్బులు దిన్నె, బాపురం, వీర్ల దిన్నె, రౌడూరు గ్రామాలలో బైక్ యాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ యాత్ర 13వ తేదీ వరకు మండలంలో కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఈరన్న వెంకటేష్, ఉలిగయ్య, వీరేష్, మాజీ ఎస్ ఎఫ్ ఐ నాయకులు వీరేష్, మాజీ డివైఎఫ్ఐ నాయకులు సురేష్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు మహేష్, ఈరన్న, డప్పు కళాకారుల సంఘం నాయకులు చిన్న, కార్యకర్తలు శంకర్, చంద్రశేఖర్, సత్యప్ప, తదితరులు పాల్గొన్నారు.

Related Posts