YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రైతు, ఎల్ఆర్ఎస్, ప్రైవేట్ టీచర్ల సమస్యలపై ప్రొ. కోదండరాం కు జగిత్యాల జిల్లా రిపోర్ట్

రైతు, ఎల్ఆర్ఎస్, ప్రైవేట్ టీచర్ల  సమస్యలపై ప్రొ. కోదండరాం కు జగిత్యాల జిల్లా రిపోర్ట్

తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం సోమవారం రాత్రి నిర్వహించిన జూమ్ మీటింగ్ లో జగిత్యాల జిల్లా రైతు సమస్యలను, భూ రికార్డుల సమస్యలు, సన్నపు వడ్లకు కనీస మద్దతు ధర, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సహాయం,  ఎల్ఆర్ఎస్ సమస్యలు, భూ రిజిస్ట్రేషన్లు, సాదా బైనామాలు, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు, వారి జీవన భృతి గురించి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి నివేదిక వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర ముఖ్యులు, నియోజక వర్గాల ఇంచార్జ్ లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో ఇటీవల జరిగిన రైతు ధర్నాలలో ప్రభుత్వ అణచివేత, పోలీసులచే ముందస్తు బలవంతపు అరెస్టులు, నోటీసులు, రైతులపై అక్రమ కేసుల నమోదు, తీవ్ర నిర్బంధంలోనూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట, అంతకు ముందు మెట్ పల్లిలో విజయ వంతంగా జరిగిన స్వచ్చంద రైతు ధర్నాల గురించి జగిత్యాల జిల్లా నివేదికలో వివరించారు. రైతులు పండించిన సన్నరకం వడ్లకు మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, సన్న రకం వడ్ల పంట నష్టం, వర్షాలతో దెబ్బ తిన్న వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటల నష్టాల గురించి, కనీస మద్దతు ధర లేకపోవడం గురించి ఈ సమావేశంలో చుక్క గంగారెడ్డి వివరించారు. జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న
ఎల్ ఆర్ ఎస్, భూ సమస్యలు, భూ రిజిస్ట్రేషన్లు, సాదా బైనామాలు ఇతరత్రా సమస్యల గురించి పూర్తి వివరంగా చర్చించడం జరిగిందన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు, కరోనా వల్ల వారు కోల్పోయిన ఉపాధి, వారికి ప్రభుత్వ జీవన భృతి గురించి ప్రధానంగా చర్చించారు. రైతు సమస్యలపై, ప్రైవేట్ టీచర్ల సమస్యలపై, భూ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. ఎం.కోదండరాం నేతృత్వంలో సమావేశ తీర్మానం జరిగిందన్నారు. అతి త్వరలో కార్యాచరణ ప్రకటించి రైతులతో రైతు సమస్యలపై, ప్రైవేట్ ఉపాధ్యాయులతో వారి సమస్యలు, జీవనోపాధి గురించి ఉద్యమ పోరాటాలు ఉదృతంగా నిర్వహించాలని అన్ని వారిని కోదండరామ్ ఆదేశించడం జరిగిందని చుక్క గంగారెడ్డి తెలిపారు. ఈ జూమ్ మీటింగ్ లో జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక కమలాకర్, కోరుట్ల, ధర్మపురి నియోజక వర్గాల ఇంచార్జ్ లు కంతి మోహన్ రెడ్డి, రామగిరి సంతోష్ లు పాల్గొన్నారు.

Related Posts