YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు

విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు

భాజపాలో కీలక నేత... క్యాడర్కు సదా అందుబాటులో ఉంటాడనే పేరు...  రెండు సార్లు ఓటమి పాలైనా పోరాటం ఆపలేదు. చివరకు మూడోసారి విజయం సాధించి.. దుబ్బాక పీఠం కైవసం చేసుకున్నారు మాధవనేని రఘునందన్ రావు. ఐపీఎల్ మ్యాచ్ తరహాలో ఉత్కంఠగా సాగిన ఓటింగ్లో అధికార పార్టీపై స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస జోరు, కాంగ్రెస్ నుంచి పోటీని దీటుగా ఎదుర్కొని విజయభేరీ మోగించారు.రఘునందన్ రావు తెరాసతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి భాజపాలో కీలక నేతగా మారారు. చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్లింది. ‌హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో రఘునందన్ రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. సిద్దిపేటలో బీఎస్సీ చేసిన రఘనందన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు.
రెండుసార్లు ఓటమి
తెరాస ప్రారంభం నుంచి రఘునందన్ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెండైన రఘు.. భాజపాలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో విజయం సాధించారు.

Related Posts