YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

రఘనందన సెట్ చేసేశారా..

రఘనందన సెట్ చేసేశారా..

దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం ఆయన వ్యక్తిగతమే కాదు పార్టీకి భవిష్యత్ పై ఆశలు పెంచారని చెప్పక తప్పదు. రఘునందన్ రావు ఈ ఎన్నికలలో గట్టి పోటీ ఇస్తారనుకున్నారు కాని ఆయనకే విజయం వరిస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరకు బీజేపీ సయితం పైకి ప్రకటనలు చేస్తుంది తప్ప లోపల సెకండ్ ప్లేస్ వస్తే చాలని అనుకుంది. అటువంటి పరిస్థితుల్లో రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి అధికార టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చారు.రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాక. రఘునందన్ రావు 1968లో జన్మించారు. ఆయన ప్రజా సమస్యల పట్ల చిన్న నాటి నుంచే స్పందించే వారు. రఘునందన్ రావు న్యాయవాది వృత్తి చేపట్టారు. అంతకు ముందు పటాన్ చెరువు కు ఒక దినపత్రికలో న్యూస్ కంట్రిబ్యూటర్ గా పనిచేశారు. ఐదేళ్లు జర్నలిస్ట్ గా పనిచేసిన రఘునందన్ రావు తర్వాత న్యాయవాది వృత్తిని చేపట్టారు.ఆ తర్వాత 2001లో రాజకీయాల పట్ల ఆకర్షితులై తెలంగాణ రాష‌్ట్ర సమితిలో చేరారు. ఇటు న్యాయవాద వృత్తి చేస్తూనే రాజకీయాల్లో రాణించాలని రఘునందన్ రావు భావించారు. టీఆర్ఎస్ లో బలమైన గొంతున్న నాయకుడిగా పేరు గడించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశం అయినందుకు రఘునందన్ రావు ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రఘునందన్ రావు బీజేపీలో చేరారు.అప్పటి నుంచి రఘునందన్ రావు బీజేపీలోనే కొనసాగుతున్నారు. వరసగా మూడు సార్లు దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సానుభూతి ఈ ఎన్నికల్లో బాగా పనిచేసింది. మరోవైపు రఘునందన్ రావు కుటుంబ సభ్యుల ఇళ్లపై జరిగిన పోలీసు దాడులు కూడా ఆయనపై సానుభూతిని పెంచాయని చెప్పకతప్పదు. మొత్తం మీద రఘునందన్ రావు ట్రెండ్ సెట్టర్ గా మారారు. టీఆర్ఎస్ ను ఓడించి రఘునందన్ రావు బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ పై ఆశలు పెంచినట్లే.
పక్కా ప్లాన్ తో గెలుపు
భారతీయ జనతా పార్టీని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ప్రధానంగా ఓట్లను తమవైపునకు కీలక సమయాల్లో తిప్పుకోవడంలో బీజేపీకి మించిన పార్టీ లేదనే చెప్పాలి. గెలిచినా, ఓడినా తెలంగాణలో బీజేపీకి దుబ్బాక ఉప ఎన్నికల్లో సుస్థిర స్థానం దక్కినట్లే చెప్పాలి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగానే పేర్కొనాలి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం నుంచి బీజేపీ దూకూడుగా వెళ్లింది. అధికార టీఆర్ఎస్ పార్టీని అడగడుగునా అడ్డుకుంది. మూడు సార్లు అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయిన రఘునందన్ ను అభ్యర్థిగా ప్రకటించి సానుభూతి ఓట్లను సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. రఘునందన్ బంధువుల ఇళ్లపై పోలీసుల దాడులు, బండి సంజయ్ అరెస్ట్ వంటివి బీజీపీకి బాగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి.బీజేపీ కేంద్ర నాయకత్వం పెట్టుకున్న ఆశలను రాష్ట్ర నేతలు నెరవేర్చారనే చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ ను మూడో స్థానానికి బీజేపీ నెట్టేసింది. తాను టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయమని దుబ్బాక ఉప ఎన్నికల్లో నిరూపించింది. ఇది ఖచ్చితంగా రానున్న కాలంలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా బీజేపీకి లాభించే అంశమేనని చెప్పక తప్పదు. దీంతో పాటు ఇప్పటి వరకూ బీజేపీలో చేరేందుకు ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపడం లేదు.
కానీ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాత బీజేపీలో చేరిక లు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు నేతలు రాకపోయినా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతాయి. మొత్తం మీద దుబ్బాక ఉప ఎన్నికల బీజీపీకి కలసి వచ్చిందనే చెప్పాలి. నాయకత్వాన్ని పెంచుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును పెంచుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ నేతలు మోదీ, షాల నమ్మకాన్ని రాష్ట్ర నేతలు దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా నిలబెట్టారనే చెప్పా

Related Posts