YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతుల పాలిట రాళ్లే వరం

 రైతుల పాలిట రాళ్లే వరం

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి, తాంసి(కే), గొల్లఘడ్‌, నిపాని.. తాంసి మండలం గోట్కూరి గ్రామాల్లో ఐదు వేల ఎకరాల్లో రాళ్లతో కూడిన భూములు ఉన్నాయి. వీటిని చలువ, పిండిరాయి భూములు అని కూడా అంటారు. ఇవి సహజసిద్ధంగా ఏర్పడుతాయి. గుట్టల ప్రాంతాల్లో ఉన్న ఈ భూ ము లు వేసవిలో రాళ్లు, రప్పలతో నిండి ఉంటాయి. వానకాలం లో మాత్రం పచ్చని పంటలతో కళకళలాడుతాయి. ఈ భూముల్లో పత్తి, కంది, సోయాబీన్‌ పండిస్తారు. 80 శాతం పత్తి, 20 శాతం కంది, సోయాబీన్‌ సాగవుతాయి. దశాబ్దాలుగా గిరిజనులు ఈ భూముల్లో పంటలు వేసి మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ భూముల్లో ఉండే రాళ్లు  రైతుల పాలిట వరంగా మారాయి. సాధారణంగా ఐదు కిలోల బరువు ఉం డే రాయి ఇక్కడ 250 గ్రాముల బరువు ఉంటుంది. ఈ రా ళ్లలో రైతులకు మేలు చేసే ప్రత్యేకత దాగి ఉంది. వర్షాలు ప డినప్పుడు నీటిని ఒడిసిపట్టుకొనే గుణం ఈ రాళ్లలో ఉంది. బరువు తక్కువగా ఉండే ఈ రాళ్లు వాన నీటిని పీల్చుకొని బరువుగా మారుతాయి. వానలు లేని సమయంలో పంటలకు నీటిని వదులుతాయి. దీంతో పంటలు రాళ్ల నుంచి వ చ్చిన నీటి ద్వారా ఏపుగా పెరుగుతాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లోని మారుమూల గ్రామాల్లోని ఈ భూములను రైతులు విక్రయించరు. ఎలాంటి నీటి సౌకర్యం లేని రాళ్లు, రప్పలతో నిండి ఉన్న ఈ భూమి విలువ ఎకరానికి కనీసం రూ.8 లక్షల వరకు ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.భీంపూర్‌ మండలంలోని పిండిరాయి భూములకు చెందిన రైతులు మాత్రం మే చివరి వారంలో పత్తి, సో యాబీన్‌, కంది విత్తనాలు చల్లుతారు. ఏటా జూన్‌ మొద టి వారంలో పడిన వర్షంతో వేసిన విత్తనాలు మొలకెత్తుతాయి. భూముల్లో ఉండే రాళ్లు వర్షం నీటిని పీల్చుకుని మొక్కలకు నీటిని అందిస్తాయి. దీంతో 20 రోజులకు పైగా వర్షం పడకున్నా ఏమికాదు. రాళ్ల కింద తేమ శాతం అధికం గా ఉండడంతో మొక్కలు పెరగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాళ్లు తమ భూములకు డ్రీప్‌ పద్ధతిలో నీటి ని అందించేలా ఉపయోగపడుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఇతర రైతుల కంటే ముందుగా విత్తనాలు వేస్తారు. పంట దిగుబడులు కూడా తొందరగా వస్తాయి. ఎలాంటి నీటి సౌకర్యం లేకుండా కేవలం వర్షాలపై ఆధారపడి రాళ్ల సాయంతో రైతులు మంచి పంట దిగుబడులు సాధిస్తున్నారు. ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు.యేటా నాలుగు గ్రామాల పరిధిలోని రైతులు మే చివరి వారంలో పత్తి విత్తనాలు వేస్తారు. వర్షాలు ఎక్కువ పడితే జనవరి చివరి వరకు పంట దిగుబడులు వస్తుంటాయి. ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. దీంతో పాటు 7 నుంచి 9 క్వింటాళ్ల వరకు సోయాబీన్‌.. 8 క్వింటాళ్ల కంది పంట రైతుల చేతికి వస్తుంది. నాలుగు గ్రామాల పరిధిలో 5 వేల ఎకరాల్లో ఈ పంటలు సాగవుతుండగా 1,500 మంది రైతులు ఉపాధి పొందుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌ సదుపాయం ఉంది. ఇతర రైతుల మాదిరి అన్ని పథకాలు ఈ గ్రామాల రైతులకు వర్తిస్తాయి.

Related Posts