YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతులకు పరిహారం ఎక్కడా...

రైతులకు పరిహారం ఎక్కడా...

రైతే రాజు ఇది వినడానకి ఎంతో బాగున్న క్షేత్ర స్థాయిలో చూస్తే దానికి భిన్నంగా కనిపిస్తోంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదల ప్రవాహంతో వేల ఎకరాలలో పంట నష్టం జరిగిన రైతులను పట్టించుకున్న వారు లేకపోవడం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ది ఏమిటో అందరికి తెలిసిన విషయమేనని, వరద ముంపుతో నీటమునిగిన బస్తీలు, కాలనీలలో బాధితులకు నేరుగా నగదును ప్రజా ప్రతినిధులతో పంపిణీ చేసిన ప్రభుత్వం చిన్నకారు, సన్నకారు, కౌలు రైతులు ఆరుగాళం కష్టపడి అప్పులు చేసి వేసిన పంట భారీ వర్షాలు, వరదలతో నేలపాలై ఆందోళన చెందుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు కన్నీటి పర్యంతమైతున్నారు. ఘట్‌కేసర్‌ మండలంతో పాటు పోచారం, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలలో దాదాపు 1050 ఎకరాల పంట నష్టం జరిగినట్టు దానిలో 390 మంది రైతులు ఉన్నట్టు వ్యవసాయ అధికారుల సర్వేలు చేపుతున్నాయి. సర్వేలు చేసిన తర్వాతా సహాయం అందించడానికి ఆలస్యం ఎందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వేలు రికార్డులకు మాత్రమే పరిమిత మవనున్నాయా అంటు రైతులు ప్రశ్నిస్తున్నారు. మూసి పరివాహక ప్రాంతాలైన కాచవాని సింగారం, ప్రతాప్‌ సింగారం, కొర్రెముల, వెంకటాపూర్‌ ఘణపూర్‌ ఇలా ప్రతి గ్రామంలో వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న చిన్న, సన్నకారు, కౌలు రైతుల బతుకులు నేడు దుర్బంగా మారాయి. కొర్రెముల పరిధిలోని ప్రతాప్‌ సింగారంకు చెందిన కౌలు రైతు 8ఎకరాలలో వేసి వరిపంట నేలకు ఒరుగడంతో వరి మొలుకలు వచ్చి నారుమడిగా మారిపోయింది. పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే తక్షణ కర్తవ్యంగా చేపట్టిన మరమ్మత్తులను సహితం నెలలు గడుపుతుండడంతో రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అర్ధమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు బందు సమితి, వ్యవసాయ అధికారులు, అధికార పార్టీ నాయకులు వారం రోజుల పాటు తక్షణమే రైతులకు సహాయం అందించిన విధంగా ఫోటోలకు ఫోజులు తప్ప రైతులకు ఒరిగింది ఏమిలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తమ పబ్బం గడుపుకోడానికి రైతులను రాజును చేస్తాం, రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందనే వేదికల పై చేస్తున్న ప్రసంగాలు రైతులను మబ్యపెట్టడానికేనని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తక్షణ సహాయం అందించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి పంట నష్టం జరిగిన రైతులకు ఆర్ధిక సహాయం అందించాలని రైతులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.8 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. మాకు వ్యవసాయమే ఆధారంగా మా కుటుంబం బతుకు తుంది. భారీ వర్షాలతో వరి పంట పూర్తిగా నేలపాలైంది, చేపు తడిచి వరినారు మడిగా మారిపో యింది. దాదాపు 1లక్ష 80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము. పంట నేలపాలు కావడంతో నా భార్య భెంగతో మంచం పట్టింది. వచ్చిన కాడికి కోసుకుంటన్నాము. ప్రభుత్వ మమ్మల్సి ఆదుకోవాలని కోరుతున్నారు

Related Posts