YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ బాటలో బీజేపీ

వైసీపీ బాటలో బీజేపీ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎపుడు జరుగుతాయి అన్నది దేవుడికే తెలియాలి అంటున్నారు. ఎందుకంటే అధికార పార్టీకేమో వచ్చే ఏడాది ఏప్రిల్ తరువాతనే నిర్వహించాలని ఉంది. వైసీపీ ఎస్ అంటే నో చెప్పే టీడీపీకి మాత్రం అర్జంటుగా ఇపుడే ఎన్నికలు జరిగిపోవాలి. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇపుడు పదవిలో ఉన్నారు. ఆయన చల్లని చూపులు ఉండగానే ఎన్నికలు జరిపించేసుకుంటే ఏమైనా రాజకీయ లాభం కలుగకపోతుందా అన్నది సైకిల్ పార్టీ ఆరాటం. దాంతో ఎన్నికలు ఇపుడే పెట్టాలి అంటూ టీడీపీ పెద్ద గొంతులో డిమాండ్ చేస్తోంది.సందట్లో సడేమియా అన్నట్లుగా ఇపుడు ఏపీ ఎన్నికల సీన్ లోకి బీజేపీ వచ్చింది. ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఏపీలో ఎన్నికలను కనీసం రెండు నెలలు వాయిదా వేయమంటున్నారు. దానికి ఆయన సబబైన కారణమే చెబుతున్నారు. మరో రెండు నెలలు ఆగితే ఏపీలో కొత్త ఓటర్లు వస్తారని, వారికి కూడా ఓటు వేసే చాన్స్ వస్తుందని ఆయన ఎన్నికల సంఘానికి తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. నిజంగా ఇది మంచి సూచనే. ఎన్నికల్లో ఎంతమంది అదనంగా పాలుపంచుకుంటే అంతగా ప్రజాస్వామ్యం వికసిస్తుంది. 2021 జనవారి నాటికి 18 ఏళ్ళు నిండిన వారంతా ఓటేసేందుకు రెడీ అవుతారు.ఇక మరో పార్టీ కాంగ్రెస్ అయితే ఏపీలో జిల్లాలు కొత్తవి ఏర్పాటు అవుతున్నాయి కదా అంత వరకూ వేచి ఉండి ఎన్నికలు పెడితే బాగుంటుంది. కొత్త పదవులు కూడా అనేకం వస్తాయని అఖిల పక్ష సమావేశంలోనే సూచించిందని వార్తలు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తీసుకుంటే ఎన్నికల సంఘం మీదనే భారం వేశారు. మీకు ఏది మంచి అనిపిస్తే అలా చేయండంటూ తన నిర్ణయం చెప్పకుడా ఎన్నికల సంఘం మీదనే బాధ్యత నెట్టేశారు. మరి ఏపీలో ప్రధానమైన పార్టీలు ఇలా చెబుతూంటే అర్జంటు గా ఎన్నికలు పెట్టమని ఒక్క తెలుగుదేశం పార్టీనే కోరుతున్నట్లుగా కనిపిస్తోంది.చిత్రమేంటంటే ఎన్నికలు పెట్టి అక్కడ నెగ్గడం కాదు. ఎన్నికలు పెట్టించుకునే విషయంలో మాట నెగ్గించుకోవాలి. ఇదే టీడీపీ పంతంగా కనిపిస్తోంది. ఈ విషయంలో తనతో కలసిరాలేదని, తన పాటను పాడలేదని జనసేన మీద కూడా టీడీపీ నేతలు గుర్రుమంటున్నారు. అలాగే ఎన్నికలు పెట్టే ఆలోచనను వాయిదా వేసుకోమన్నందుకు బీజేపీ మీద కూడా పసుపు పార్టీ మండిపడుతోందిట. నిజానికి ఏపీలోని మిగిలిన పార్టీలకు కూడా తెలుసు. ఫలితాలు ఎలా ఉంటాయో. అందుకే ఎన్నికలు పెట్టినా పెట్టకపోయినా ఒకటే అన్నది కొన్ని పార్టీల తీరుగా ఉంటే దీన్ని పట్టుకుని నానా యాగీ చేసి రాజకీయ లబ్ది ఇక్కడా పొందాలని చేస్తున్న టీడీపీ మార్క్ రాజకీయానికే ఇపుడు అంతా దూరంగా ఉంటున్నారు

Related Posts