YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

బీహార్ గేమ్

బీహార్ గేమ్

బీహార్ ఎన్నికల ఫలితాలు ఎంతో ఉత్కంఠను రేపాయి. ఎట్టకేలకు ఎన్డీయే తడబడ్డా నిలబడింది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీలు  125 స్థానాలను సాధించాయి. మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో 122 మేజిక్ ఫిగర్ కాగా, దానికి మూడు సీట్లను మాత్రమే అధికంగా సంపాదించింది.  మహా ఘటబంధన్ 110 సీట్లకు పరిమితం అయింది. మొదట మహా ఘటబంధన్ దే విజయమని అనుకున్నారు. కానీ ఆఖరికి ఎన్డీయే వైపే విజయం మొగ్గింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 1 స్థానానికే పరిమితం అయింది. ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 15 గంటల పాటు కొనసాగడంతో.. తుది ఫలితం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెల్లడైంది. విజయానికి కేవలం ఒక్కశాతం ఓట్ల తేడా కూడా లేకపోలేదు. ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 74, జేడీయూకు 43, మాజీ సీఎం జతిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చాకు 4, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీకి 4 స్థానాలు వచ్చాయి. ఈ మొత్తం కలిపితే 125 సీట్లు అవుతాయి. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ దూరమైనా, బీహార్ లో ఎన్డీయే సర్కారుకు మెజారిటీ పడిపోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మెజారిటీ తక్కువగా ఉండటం, ప్రతిపక్షం బలంగా ఉండటంతో బీహార్ లో ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేయడం చాలా డేంజర్ అని అంటున్నారు. ఏది ఏమైనా ఫలితాలు వెల్లడించే సమయంలోనే ఎంతో టెన్షన్ పెట్టిన బీహార్ రాజకీయాలు.. రాజకీయ సంక్షోభాలతో రాబోయే కాలంలో నెట్టుకు రావాల్సిందేనని అంటున్నారు. మహాఘటబంధన్  పరాజయానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని కూడా విశ్లేషకులు అంటున్నారు. ప్రజల్లో ఏమాత్రం బలం లేని ఆ పార్టీకి 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించారని..కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లోనే విజయం సాధించగలిగిందని అంటున్నారు. చాలా చోట్ల ఎన్‌డీఏ, ఎంఐఎం, ఇతర పార్టీలు విజయాన్ని అందుకున్నాయి. కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయడం వల్లే ఎన్డీయే విజయం సాధించగలిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Posts