YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దీదీపై అన్ని వైపులా దాడి

దీదీపై అన్ని వైపులా దాడి

బెంగాల్, నవంబర్ 16, 
పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదంటున్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో సహజంగా మమత బెన్జర్పీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బీజీపీ తనకు అనుకూలంగా మార్చుకోనుంది. మరోవైపు కాంగ్రెస్, వామపక్షాల కూటమి మమత బెనర్జీ పార్టీ ఓటు బ్యాంకుకు గండికొట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే మమత బెనర్జీలో ఇటీవల ఆందోళన ప్రారంభమయింది.పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ మమత బెనర్జీ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. నేతల వరస పర్యటనలతో మమత బెనర్జీకి ఊపిరి ఆడటం లేదు. మరోవైపు గత రెండు ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ఓటు బ్యాంకుకు సయితం చిల్లు పడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కాంగ్రెస్, వామపక్షాల కూటమితో ముస్లిం ఓటర్లు మమతను వీడే అవకాశముందని తృణమూల్ కాంగ్రెస్ భయపడిపోతున్నారు.గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్ లో గట్టి పోటీ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు తగ్గినా బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 49 శాతం ఓట్లు దక్కాయి. అయితే 18 స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. మమత బెనర్జీ పార్టీకి 43 శాతం ఓట్లు వచ్చాయి. అయినా 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. ఇదే మమత బెనర్జీకి ఆందోళన కల్గిస్తుంది.దీనికి తోడు కాంగ్రెస్, వామపక్షాలు బలం పెంచుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. పార్లమెంటు ఎన్నికలలో కేవలం రెండు స్థానాలకే పరిమితమయిన కాంగ్రెస్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. వామపక్షాలు కొన్ని చోట్ల బలంగా ఉండటంతో మమత బెనర్జీలో ఆందోళన ప్రారంభమయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కన్నా, వీరు తమ ఓటు బ్యాంకును చీలుస్తాయన్నదే మమత బెనర్జీలో కలవరానికి కారణంగా చెబుతున్నారు.

Related Posts