YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జేడీఎస్..అలా మారిపోయిందేంటీ...

జేడీఎస్..అలా మారిపోయిందేంటీ...

బెంగళూర్, నవంబర్  23, 
కర్ణాటకలో జరిగిన రెండు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. శిర, రాజేశ్వరినగరలో బీజేపీ విజయం వెనక జేడీఎస్ ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. జేడీఎస్ పోటీ చేయడం వల్లనే బీజేపీ విజయం సాధ్యమయిందని రాజకీయ విశ్లేషకులు సయితం భావిస్తున్నారు. కాంగ్రెస్ మీద ఆగ్రహాన్ని కుమారస్వామి ఈరకంగా తీర్చుకున్నారన్న కామెంట్స్ బాగానే వినపడుతున్నాయి.జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తరచూ ఇటీవల ముఖ్యమంత్రి యడ్యూరప్ప తో సమావేశమవుతున్నారు. నిధుల విషయంలో అని బయటకు చెబుతున్నప్పటికీ కుమారస్వామికి, యడ్యూరప్పకు మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందంటున్నారు. బీజేపీలో యడ్యూరప్పపై అసంతృప్తి పెరుగుతుండటంతో కుమారస్వామిని యడ్యూరప్ప దగ్గరకు తీస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఏదైనా జరిగి తన ముఖ్యమంత్రి పదవికి ఇబ్బంది ఎదురైతే కుమారస్వామి సాయం తీసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జేడీఎస్ ఉప ఎన్నికల్లో విడిగా పోటీ చేసిందంటున్నారు. దానివల్ల ఓట్లు చీలిపోయి శిర, రాజేశ్వరనగరలో కాంగ్రెస్ ఓటమి చెందింది. గత కొంతకాలంగా కుమారస్వామి కాంగ్రెస్ కు బాగా దూరమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ విడిగా పోటీ చేస్తుందని కుమారస్వామి ప్రకటించారు. ఇప్పటికే యడ్యూరప్ప బీజేపీలో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు.కేంద్ర నాయకత్వం సయితం యడ్యూరప్పకు అనుకూలంగా లేదని తెలుస్తోంది. రమేష్ జార్ఖిహోళి నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు వరస భేటీలు జరుపుతుండటం కూడా యడ్యూరప్ప ఆందోళనకు కారణమని చెప్పాలి. అందుకే అధినాయకత్వం తన పదవి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నా, తనకు అండగా కుమారస్వామి ఉన్నారని చూపించే ప్రయత్నం యడ్యూరప్ప చేస్తున్నారు. కుమారస్వామి కూడా యడ్యూరప్ప అవసరాన్ని గ్రహించి తమ నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

Related Posts