YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అధికారులు అప్రమత్తం

అధికారులు అప్రమత్తం

విజయవాడ నవంబర్ 24 
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మూలంగా రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయాని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్  అన్నారు. జిల్లా లోని అన్ని మండలాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసారు. టెలీ కాన్సెరెన్స్ ద్వారా అధికారు లకు, రెవిన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.  అన్ని డివిజనల్ కార్యాలయాల్లో  కంట్రోల్ రూమ్ లు  ఏర్పాటు  చేసాం. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు రెవిన్యూ యంత్రాంగానికి సహకరించాలి.  కృష్ణా  జిల్లాలోని ఏర్పాటు చేసిన  కంట్రోల్ రూమ్ నెంబర్లు :
బందరు కలెక్టరేట్ : 08672-252572
విజయవాడలో ని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805
సబ్ కలెక్టర్ ఆఫీస్  విజయవాడ  : 0866-2574454
సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు  08656- 232717
రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486
రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697    
భారీ వర్షాలు కారణంగా పాడుపడిన, మట్టి గోడలతో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. మత్స్యకారులెవరు సముద్రంలోకి వేటకు పోరాదని అయన హెచ్చరించారు.

Related Posts