YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వింతలు

ఆన్ లైన్ లో పెళ్లి.. ఇంటికే విందు భోజనం - కరోనా వేళ కొత్త ట్రెండ్

ఆన్ లైన్ లో పెళ్లి.. ఇంటికే విందు భోజనం - కరోనా వేళ కొత్త ట్రెండ్

కాలానికి తగ్గట్లు మారటం మామూలే. అనుకోని రీతిలో విరుచుకుపడిన కరోనా దెబ్బకు లెక్కలు మారిపోయాయి. అందరూ బాగుండాలన్న కాన్సెప్టులో ఒక జంట కొత్త సంప్రదాయానికి తెర తీసింది. యావత్ ప్రపంచం భయం గుప్పిట్లో గజగజమన్న దుస్థితి. ఇలాంటివేళ.. శుభకార్యాల్ని చాలామంది వాయిదా వేసుకున్నారు. కానీ.. ఎంతకాలం. అందుకే.. కొత్త పద్దతులకు స్వాగతం పలుకుతూ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. తాజాగా అలాంటి వాటిల్లో ఒక కొత్త ట్రెండ్ తమిళనాడులో షురూ అయ్యింది.తమ పెళ్లి వేడుక కోసం ఎక్కడికో రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ.. వెబ్ నార్ లో చూడాలని కోరారు. ఓస్.. అంతేనా? ఇదెప్పటి నుంచో ఉన్నదే కదా? అనుకోవద్దు. ఎందుకంటే అసలు ట్విస్టు ఇక్కడే ఉంది.అదేమంటే.. పెళ్లి సందర్భంగా విందు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని.. ఇంటికే విందు భోజనాన్ని పంపుతున్నట్లుగా చెప్పి.. మెనూలో ఏం ఉండనున్నాయో కూడా చెప్పారు. ఏదో విందు భోజనం అంటే సింఫుల్ గా తీసేయకుండా.. 23 ఐటెమ్ లను.. వివిధ బాక్సుల్లో సర్దేసి పంపారు. ఓవైపు స్క్రీన్ మీద పెళ్లి చూస్తూ.. మరోవైపు పసందైన వంటల్ని తింటూ పెళ్లిని ఎంజాయ్ చేశారట. ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Related Posts