YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

మధ్యే మార్గంగా కాంగ్రెస్ అడుగులు

మధ్యే మార్గంగా కాంగ్రెస్ అడుగులు

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి జీవన్ రెడ్డి పేరు ఖరారయింది. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జీవన్ రెడ్డి పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. మిగిలిన ఎవరికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా ఒకరు మరొకరికి సహకరించే పరిస్థితులు లేకపోవడంతో అందరి వాడుగా జీవన్ రెడ్డి పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జీవన్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో ముందుకు వెళ్లాల్సి ఉంది. మరి జీవన్ రెడ్డి పార్టీని విజయపథాన నడిపిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.నిజానికి పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి పేర్లు బలంగా విన్పించాయి. రేవంత్ రెడ్డి కి పదవి ఇవ్వవద్దంటూ సీనియర్ నేతలు పట్టుబట్టారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో ఒక దశలో అధిష్టానం మొగ్గు చూపిందంటున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనతో ఆయనకు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో పాటు ఇటీవల కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకు ఇబ్బందిగా మారాయంటున్నారు. దీంతో జీవన్ రెడ్డి పేరును ఖరారు చేశారు.జీవన్ రెడ్డి సీనియర్ నేత. తొలి నుంచి కాంగ్రెస్ ను నమ్మకున్న నేత. ఎలాంటి వివాదాలకు వెళ్లని లీడర్. ఆయన కంటూ ప్రత్యేక గ్రూపు లేదు. మంత్రిగా పనిచేసినా తనకంటూ ఆయన కాంగ్రెస్ లో వర్గాన్ని ఏర్పరచుకోలేకపోయారు. మృదుస్వభావి. ఏడుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు.కానీ జీవన్ రెడ్డి ఈ గ్రూపులను తట్టుకోగలరా? అన్న ప్రశ్న తలెత్తుంది. జీవన్ రెడ్డి మాటకారి కాదు. దూకుడు మనస్తత్వం అసలే కాదు. ఆయన నమ్మింది బయటకు చెప్పేస్తారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులున్నాయో చెప్పడం కష్టమే. వీరందరినీ ఒకతాటిపైకి తేవడం జీవన్ రెడ్డికి శక్తికి మించిన పనే. కేసీఆర్ ను ఎదుర్కొనాలంటే దూకుడుకుగా వెళ్లే నేతను పీసీసీ చీఫ్ గా చేయాలని అందరూ కోరుకున్నా, నిదానమే ప్రదానంలా వ్యవహరించే జీవన్ రెడ్డి ఎంపికపై అప్పుడే కొందరు నేతలు పెదవి విరుస్తుండటం విశేషం.

Related Posts