YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

రేవంత్ పై 72 కేసులు

రేవంత్ పై 72 కేసులు

రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిక్కులా మారిపోయారు. ఓ వైపు తెలంగాణ కాంగ్రెస్ విభాగంలో రేవంత్ రెడ్డి కారణంగా ఇప్పటికే రెండు గ్రూప్ లు ఏర్పడ్డాయి. మరో వైపు ఆయన మీద ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. తాజాగా ఓటుకు నోటు కేసు విషయంలో ఏసీబీ కోర్టులో  విచారణ జరిగింది. ఎంపీ రేవంత్ రెడ్డి‌తో పాటు ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై  న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.ఈ కేసులో రేవంత్‌ రెడ్డి తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కాబట్టి ఎలక్షన్ ట్రైబ్యునల్‌ విచారణ జరపాలని ఆయన తన వాదనలు వినిపించారు. ఏసీబీ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌ రావు వాదనలు వినిపించారు. రేవంత్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టడానికే ఈ కేసులు పెడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఇది తప్పుడు కేసు అని హైకోర్టులో రెండు జడ్జిమెంట్లు ఉన్నాయన్నారు. నాకు ఈ కేసుతో సంబంధం లేదని మత్తయ్య కోర్టులో డిశ్చార్జ్ పిటీషన్ వేసి కేసు కొట్టి వేయించుకున్నారని రేవంత్ తెలిపారు. ఓటుకు నోటు కేసు అయ్యాకనే ఎంపీగా గెలిచానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలే నన్ను ఆశీర్వదించారన్నారని అన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ తనపై మరో 72 కేసులు పెట్టారని.. తాను రోజూ నాంపల్లి కోర్టుకెళ్లి కేసులను ఎదుర్కొంటున్నానని అన్నారు. నేను బ్యాంకులను మోసం చేయలేదు, దోపిడీ చేయలేదని ఆయన అన్నారు. నా మీద నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని చెప్పుకొచ్చారు. నా ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే.. ఈ విషయం అర్థం అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన మీద పెట్టిన కేసులన్నీ రాజకీయంగా ప్రేరేపితమైనవేనని రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు

Related Posts