YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

సహజవాయువు పైపు లైను ను ప్రారంభించిన ప్రధాని

సహజవాయువు పైపు లైను ను ప్రారంభించిన ప్రధాని

రానున్న ఐదారేళ్ల వ్యవధిలో దేశంలోని సహజవాయు పైప్లైన్ల నెట్వర్క్ను రెండింతలు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  ప్రస్తుతం 1,500గా ఉన్న సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను పది వేలకు పెంచనున్నట్లు వెల్లడించారు. కొచ్చి-మంగళూరు మధ్య నిర్మించిన సహజవాయువు పైపులైన్ను ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు మోదీ.  ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.  'ఒకే దేశం-ఒకే గ్యాస్ గ్రిడ్'లో భాగంగా కొచ్చి-మంగళూరు పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పైప్లైన్ను జాతికి అంకితమివ్వడం గౌరవంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.  భారత ప్రజలకు, ముఖ్యంగా కేరళ, కర్ణాటక వాసులకు ఈరోజు ఎంతో ప్రత్యేకమని అన్నారు.  ఇతర నగరాల్లో కొత్త గ్యాస్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ఈ పైప్లైన్ దోహదం చేస్తుందని చెప్పారు.  భారత వృద్ధి కోసం వాయు, జల, రోడ్డు మార్గాలతో పాటు రైల్వే, మెట్రో, డిజిటల్, గ్యాస్ కనెక్టివిటీని సైతం మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. దేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

Related Posts