YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలంలో 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు ఉదయం 8 గంటల 30 నిమిషములకు   యాగశాల ప్రవేశం తో ఉత్సవాలు  మొదలవుతాయి ఉత్సవాలు సందర్భంగా జనవరి 11 నుంచి 17 వరకు  జరుగుతాయని తెలిపారు అర్జిత  సేవలను నిలుపుదల చేస్తున్నామని అభిషేకము కుంకుమార్చన యధావిధిగా జరుగుతాయని ఈవో  కెఎస్  రామారావు తెలిపారు ఉత్సవాల ఏర్పాట్లపై  దేవస్థానం పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ప్రధానార్చకులు స్థానాచార్యులు అన్ని విభాగాల అధికారులు పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవేట్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవ రోజుల్లో స్వామి అమ్మవార్లకు కైంకర్యాలను ఎలాంటి లోటు లేకుండా జరిపించాలి అన్నారు అలాగే వైదిక కార్యక్రమాల నిర్వహణ సమయం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు ఈ సమావేశంలో శ్రీశైలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి పాల్గొన్నారు ఉత్సవాల్లో భాగంగా ఈనెల 13వ తేదీ భోగీ పండ్ల కార్యక్రమం 14వ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. 11వ తేదీ ధ్వజారోహణ 12వ తేదీ భృంగి వాహనసేవ 13వ తేదీ రావణ వాహన సేవ 14వ తేదీ నంది వాహన సేవ బ్రహ్మోత్సవాల కళ్యాణం 15వ తేదీ కైలాస వాహన సేవ 16వ తేదీ పూర్ణాహుతి త్రిశూల స్నానం 17వ తేదీ అశ్వవాహన సేవ  సంక్రాంతి బ్రహ్మోత్సవ కళ్యాణం లో స్థానిక చెంచు  గిరిజనులు ప్రత్యేకంగా పాల్గొంటారు వారు ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలు  తేనె పండ్లు వెదురు బియ్యము ఆకులతో వెళ్ళిన బాసికా లు స్వామివారికి యజ్ఞోపవీతము అమ్మవారికి వడ్డానం మొదలైన వాటిని సమర్పిస్తారు ఐటిడిఎ సహకారంతో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పలు ప్రాంతాల నుంచి చెంచు  భక్తుల్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు.

Related Posts