YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

వరంగల్ కార్పోరేషన్ కమలానిదే

వరంగల్ కార్పోరేషన్ కమలానిదే

 రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జోష్యం చెప్పారు. సీఎం కేసీఆర్ మందు తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నాడని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల్లో విజయ దుందుభి మోగించిన అనంతరం మొదటి సారి వరంగల్ పర్యటనకు వచ్చిన బండి సంజయ్ భారీ రోడ్ షో లో అడుగడుగునా బీజేపీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. సుమారు ఐదు గంటల పాటు రోడ్ షో కొనసాగిన అనంతరం వరంగల్ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్ లో బండి సంజయ్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 37వ డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య, వరంగల్ అర్బన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సముద్రాల మధు, వరంగల్ తూర్పు కాంగ్రెస్ నాయకుడు గంట రవి, టీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకులు గైనేని రాజన్ లతో పాటు సుమారు 25 మంది బండి సంజయ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు కప్పి బీజేపీ పార్టీలోకి బండి సంజయ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనను దులిపేశారు. వరంగల్ లో స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం 196 కోట్లు మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారిమళ్లించి , 40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు.  వరంగల్ అభివృద్ధిపై భద్రకాళీ టెంపుల్ లో ప్రమాణానికి వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన కనిపిస్తుందే తప్ప, రాష్ట్రాన్ని బాగుచేసిన పరిస్థితులు మాత్రం కనిపించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ నీతిమాలిన రాజకీయమే రానున్న రోజుల్లో బీజేపీకి బలంగా మారుతుందని, రానున్న ప్రతీ ఎన్నికలోనూ కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ఈ సమావేశంలో బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Related Posts