YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

తమిళనాడులో డోర్ క్లోజ్

తమిళనాడులో డోర్ క్లోజ్

తమిళనాడులో రజనీకాంత్ ప్రకటన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారనున్నాయి. ఇప్పటి వరకూ అన్నాడీఎంకే కూటమి అధికారంపై ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా బీజేపీ రజనీకాంత్ సాయంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి డీఎంకే కూటమిని దెబ్బతీయాలని తలపోసింది. అయితే రజనీకాంత్ తాను రాజకీయ పార్టీని పెట్టబోనన్న ప్రకటనతో బీజేపీ తమిళనాడు శిబిరంలో టెన్షన్ మొదలయింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనే ఏమాత్రం ప్రభావం బీజేపీ చూపలేదు.అన్నాడీఎంకే కూటమి పైకి బలంగా కన్పిస్తున్నా అది అధికారంతో కూడుకున్నదేనన్నది అందరికీ తెలిసిందే. అయినా పళినిస్వామి, పన్నీర్ సెల్వంను ముందు పెట్టి తాను రాజకీయ ఆటను బీజేపీ ప్రారంభించింది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటం, సమర్థమైన నాయకత్వం లేకపోవడంతో బీజేపీ రజనీకాంత్ పార్టీ వస్తే బెటరని భావించింది. అనేక రాష్ట్రాల్లో చేసిన ప్రయోగాన్నే తమిళనాడులోనూ ఉపయోగించాలని చూసింది.కానీ రజనీకాంత్ రాజకీయ పార్టీని పెట్టడం లేదని ప్రకటించడంతో బీజేపీలో నిరాశ మొదలయింది. ఇప్పుడు అన్నాడీఎంకే కూటమిని బలోపేతం చేయాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉంది. కమల్ హాసన్ బీజేపీ అంటేనే కాలు దువ్వుతున్నారు. తమిళనాడులో మతపరమైన, హిందుత్వ రాజకీయాలు పనిచేయవు. అందుకే రజనీకాంత్ ను ప్రయోగించాలని చూసినా అది వికటించడంతో మరో మార్గం కోసం బీజేపీ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.తమిళనాడులో ఎవరు కాదన్నా శశికళకు కొంత ఇమేజ్ ఉంది. ఆమె క్రేజ్ ఇంకా తగ్గిపోలేదు. అందుకే వచ్చే నెలలో విడుదలయ్యే శశికళను అన్నాడీఎంకేకు దగ్గర చేయాలన్న ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ కూడా జయలలిత ఆశయాలు నెరవేర్చాలని చెప్పడం, పళనిస్వామి, పన్నీర్ సెల్వం అమ్మ బొమ్మతోనే ఎన్నికలకు వెళుతుండటంతో శశికళను అన్నాడీఎంకే కు సన్నిహితం అయ్యేలా చేయాలన్నది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది. అయితే ఇది అంత సులువు కాదు. ఆమెకు పార్టీ పూర్తిగా అప్పగిస్తేనే అందుకు అంగీకరిస్తారు. ప్రస్తుతం ఆ పరిస్థితి అన్నాడీఎంకేలోలేదు. అందుకే రజనీకాంత్ ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ కనపడుతుంది.

Related Posts