YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

ఆర్జేడీ, జేడీయూ కలిసిపోతాయా

ఆర్జేడీ, జేడీయూ కలిసిపోతాయా

బీహార్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జేడీయూ, ఆర్జేడీలు కలిసిపోతాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ ఎమ్మెల్యేలను ఆరుగురిని బీజేపీలోకి తీసుకోవడంతో నితీష్ కుమార్ కు, బీజేపీ అధినాయకత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. కూటమిలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు. దీంతో జేడీయూ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ వల వేస్తుంది.ఇప్పటికే జేడీయూకు చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ తో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. వీరితో పాటు మరికొందరు వస్తే ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ మేరకు నితీష్ కుమార్ కు ఆర్జేడీ నుంచి ప్రతిపాదన కూడా అందినట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ కు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో యూపీఏ తరుపున ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తామని, తేజస్వి యాదవ్ కు ముఖ్యమంత్రి దక్కేలా సహకరించాలని నితీష్ కుమార్ ను కోరారు.అయితే గతంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసిన నితీష్ కుమార్ ఆ పార్టీతో జత కట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఆర్జేడీ తో జతకలిస్తే బీహార్ రాజకీయాలకు నితీష్ కుమార్ దూరం కావాల్సి ఉంటుంది. ఏడోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ కు బీజేపీ నుంచి ప్రస్తుతం ఇబ్బంది లేదు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని బీజేపీ పదే పదే చెబుతుంది.అయితే అరుణాచల్ ప్రదేశ్ లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడాన్ని నితీష్ కుమార్ తప్పు పడుతున్నారు. అలాగే లోక్ జనశక్తి పార్టీ ని దగ్గరకు తీసుకోవడాన్ని కూడా నితీష్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నార. గత ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ తన పార్టీ ఓటమికి కృషి చేశారని, అటువంటి వారిని ఎన్డీఏలోకి చేర్చుకోవద్దని కూడా బీజేపీకి నితీష్ కుమార్ తెలిపినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లు అంత సులువుగా నితీష్ కుమార్ బీజేపీని వీడరన్న వాదన అయితే బలంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి

Related Posts