YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

పక్కా ప్లాన్ తో కమలం...?

పక్కా ప్లాన్ తో కమలం...?

తెలంగాణలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది బీజేపీ. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మరిన్ని వ్యూహాలు రచిస్తోంది. తెలంగానలో త్వరలో ఎలాంటి ఎన్నికలు జరిగిన వాటిలో గెలుపే సాధించే దిశగా పక్కా ప్రణాళికలు రచిస్తోంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇవాళ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ రాష్ట్రానికి రానున్నారు. ఆయన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మూడు జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నద్ధతపై తరుణ్ ఛుగ్ సమీక్షిస్తారు. అదేరోజు సాయంత్రం బోధన్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాతి రోజు ఖమ్మం, శనివారం వరంగల్‌లో జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరు కానున్నారు. ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనున్న తరుణ్‌చుగ్‌... బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.అనంతరం నిజామాబాద్‌ పర్యటనకు వెళ్తారు. మొదట ఇందల్వాయి చేరుకుని.. అక్కడి నుంచి ర్యాలీగా డిచ్‌పల్లికి వెళ్తారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం బోధన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. శుక్ర, శనివారాలలో త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగే ఖమ్మం, వరంగల్‌లో తరుణ్‌చుగ్‌ పర్యటించేలా టూర్‌కు ప్లాన్‌ చేశారు. రెండుచోట్ల ఎన్నికల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఖమ్మం కార్పొరేషన్‌లో పర్యటిస్తారు. ఖమ్మంలో పలువురు నాయకులు, పలు వర్గాలకు చెందినవారితో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్ని కూడా బీజేపీ సీరియసగా తీసుకుంది. ఈ ఎలక్షన్‌‌లో కూడా కాషాయం జెండా ఎగురవేయాలని పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ కార్పొరేటర్లు కొందరు బీజేపీ చేరారు. మరోవైపు తరుణ్‌చుగ్‌ సమక్షంలో కూడా పలువురు నాయకులు కమలం తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. మొత్తం మీద తరుణ్ చుగ్ పర్యటన పార్టీకి కలిసివస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Related Posts