YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ముగ్గుల పోటీలు

ముగ్గుల పోటీలు

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లసమన్నపల్లి గ్రామంలో యూనిసెఫ్ ,స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. కరోనా నియంత్రణ, ప్లాస్టిక్ నివారణ ప్రాధాన్యతతో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలను ఎంపీపీ సారబూడ్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. పోటీల్లో  పాల్గొన్న విద్యార్థులకు, మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం మహిళలచే బతుకమ్మ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా  సర్పంచ్ కాయిత రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ ముగ్గుల పోటీలు మహిళల్లో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందిస్తాయని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందనవారు నిరుత్సాహపడకుండా మరింత ప్రతిభ పెంచుకుని ముందుకు పోవాలని సూచించారు. ప్రపంచాన్ని ,దేశాన్ని, రాష్ట్రాన్ని గడగడ వణికించిన కరోనాపై ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం వల్ల మహిళల్లో చైతన్యం పెరిగి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారని పేర్కొన్నారు .కరోనా రెండో విడత ప్రారంభమైందని దాని పట్ల ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ భూతాన్ని ప్రజలు తరిమికొట్టాలని ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ కారక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్లాస్టిక్కు  దూరంగా ఉండాలని కోరారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి పరిశుభ్రంగా ఉండాలని అన్నారు.

Related Posts