YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం తెలంగాణ

కరోనా వాక్సిన్ డ్రై రన్ కార్యకమాన్ని నిబంధనలను పాటిస్తూ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్

కరోనా వాక్సిన్ డ్రై రన్ కార్యకమాన్ని నిబంధనలను పాటిస్తూ  నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్

కరోనా వాక్సిన్ డ్రై రన్ కార్యకమాన్ని నిబంధనలను పాటిస్తూ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆన్నారు.గురువారం నాడు ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వైద్య ఆరోగ్య అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, డిఎస్ పిలు, తహాశీలుదార్లతో రేపు 8 వ తేదీన జిల్లాలో నిర్వహించే కరోనా వాక్సిన్ డ్రై రన్ కార్యకమం నిర్వహణ పట్ల సమీక్షించారు. డ్రైరన్ కార్యకమాన్ని అసలు కార్యకమం లాగా
భావించి పూర్తి స్థాయిలో అవగాహనతో పనిచేయాలని, చెస్ట్ ప్రకారం డ్రైరన్ నిర్వహణలో ప్రతి అంశాన్ని కుణ్ణంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి వాక్సినేషన్ కేంద్యంలో వెయిటింగ్, వాక్సినేషన్, అబ్జర్వేషన్ రూముల ఏర్పాటు ఉంటుందని, వాక్సిన్ పొందేందుకు వచ్చిన వ్యక్తిని మొదటి గదిలో ఉంచి కోవిద్ యాప్లో వారి పేరును గర్తించి వివరాలు నిర్ధారిస్తారని, అనంతరం రెండవ గదిలో వాక్సిన్ వేయడం జరుగుతుందని, అనంతరం అతనిని మూడవ గదిలో పర్యవేక్షణలో వుంచడం జరుగుతుందని తెలిపారు. డ్రైరన్ లో 25 మంది హెల్త్ వర్కర్స్ కు వాక్సిన్ వేయడం జరుగుతుందని, వాక్సిన్ తీసుకున్న వ్యక్తిని పర్యవేక్షించడం ముఖ్యమని తెలిపారు. కమ్యూనిటీ, పాథమిక హెల్త్ సెంటర్లలో కోల్డ్ చైన్ పాయింట్స్ లో వాక్సిన్ భద పరచేందుకు అన్ని వసతులు ఉండేలా చూడాలని తెలిపారు. ఏ వాక్సినేషన్ కేంద్రానికి ఏ కోల్డ్ చైన్ పాయింట్ నుండి వాక్సిన్ వచ్చేది పకడ్బందీగా వుండాలని తెలిపారు.

 

ప్రతి వాక్సినేషన్ కేంద్యంలో వాహనం సిద్ధంగా వుంచాలని, వాహనం నెంబరు, డ్రైవర్ నెంబరు అందరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏ హెల్త్ సెంటర్ కు ఏ ఆసుపతి ని రిఫర్ చేసిన వివరాలను అన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు. ప్రతి కోల్డ్ చైన్ పాయింట్ వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లు తప్పనిసరిగా చూడాలని, ప్రతి చిన్న విషయాన్ని శుద్దగా నిర్వహించాలని తెలిపారు. వాక్సినేషన్ కేంద్రలలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు, డిఎస్ పిలు, తహశీలుదార్లు వాక్సినేషన్ కేందాలు,కోల్డ్ స్టోరేజీల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు.జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్ శ్వేత వాక్సినేషన్ సంబంధించి అన్ని స్థాయిలలో బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వాక్సినేషన్ కేందాలలో గదులను సులభంగా గుర్తించే విధంగా ఏర్పాట్లు చేయాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోతే),
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ చందశేఖర్, జిల్లా ఏరియా ఆసుపతి) కోఆర్డినేటరు డాక్టర్ అజయ్, డిప్యూటీ వైద్య అధికారులు డాక్టర్ శోభారాణి, డాక్టర్ మోహన్ బాబు ,అధికారులు పాల్గొన్నారు.

Related Posts