YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

టీకాకు అంతా రెడీ

టీకాకు అంతా రెడీ

కరోనా వైరస్ మహమ్మారికి టీకాలు అందుబాటులోకి రావడంతో అత్యవసర వినియోగం కింద పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. భారత్ కూడా రెండు టీకాలకు అనుమతి ఇవ్వడంతో.. మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాబోతోంది. అయితే, టీకా విషయంలో ప్రజలు సానుకూలంగా ఉన్నారా? వారి ఆలోచన ఏంటి? కరోనా టీకా వేయించుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారా..? లేక వేచిచూసే ధోరణిలో ఉన్నారా? అనేది తెలుసుకోడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.సర్వే ప్రకారం 69 శాతం మంది టీకా తీసుకునే విషయంలో సందిగ్దంలో ఉన్నట్టు వెల్లడించారు. తీసుకోవాలా? వద్దా? అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నామని, మరి కొంత కాలం వేచి చూసే ధోరణిలో ఉన్నారని తేలింది. ఆక్స్‌ఫర్డ్ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించినా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టీకాల భద్రత, క్లినికల్ ట్రయల్స్‌ ఫలితాలకు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడమే ఈ సందిగ్ధానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.టీకాల అనుమతి ప్రక్రియకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడం కూడా ఓ కారణమని అంటున్నారు. కరోనా టీకాపై మీ వైఖరి ఏంటి అన్న ప్రశ్నకు 8,723 మంది సమాధానం ఇచ్చారు. వీరిలో దాదాపు 69 శాతం మంది టీకా తీసుకునే విషయంలో సందిగ్ధంలో ఉన్నామని తెలిపారు. అక్టోబర్‌ నాటి సర్వేలో 61 శాతం మంది తమకు టీకా విషయంలో అనేక సందేహాలు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ఫైజర్, మోడర్నా టీకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చేపట్టిన సర్వేలో ఇది 59 శాతానికి పడిపోయింది.అయితే, తాజా సర్వేలో మాత్రం పెరిగి 69 శాతానికి చేరుకుంది. కాగా, పిల్లలకు తక్షణం టీకా వేయించేందుకు కేవలం 26 శాతం మందే సుముఖత వ్యక్తం చేశారు. మరో 12 శాతం మంది విముఖత చూపగా.. మిగతా 56 శాతం మంది మాత్రం మరో మూడు నెలల పాటు వేచి చూసి అప్పటి పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.డిసెంబరులో నిర్వహించిన సర్వేలో 55 శాతం మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది టీకా తీసుకోవడంలో ఎటూ తేల్చుకోవడం లేదని లోకల్‌సర్కిల్స్ సభ్యుడు డాక్టర్ అబ్దుల్ గఫౌర్ అన్నారు. టీకా దుష్ప్రభావం, సమర్ధత, ప్రభావశీలతపై పూర్తి సమాచారం లేకపోవడంతో ఈ సందిగ్ధం నెలకుంది.

Related Posts