YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

మళ్లీ రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి

మళ్లీ రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి

కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో టాలీవుడ్‌ని షేక్ చేసిన శ్రీ రెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంట పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో మకాం వేసిన ఈ సంచలన తార ఏదో ఒక టాపిక్‌తో నెటిజన్ల దృష్టి తనపై వేసుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. సమాజంలో రోజూ జరుగుతున్న విషయాలపై స్పందించడంతో పాటు తన హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా నిషిద్ద ప్రాంతం అంటూ షర్ట్ పైకెత్తి దడ పుట్టించే కామెంట్ చేసింది.నేను గ్లామరస్ షో చేయడం ప్రారంభిస్తే.. స్టార్ హీరోయిన్లు నా వెనుక నిలబడాల్సిందే అంటూ రంగంలోకి దిగిన శ్రీ రెడ్డి ప్రతిరోజు ఏదో ఒక హాట్ పిక్ పోస్ట్ చేస్తూ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. తన భారీ అందాల గేట్లు తెరచి కెమెరా ముందు పెడుతుండటంతో నెటిజన్లు సైతం రెచ్చిపోతుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ సెగలు రేపే ఫొటో షేర్ చేస్తూ డర్టీ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.షర్ట్ పైకెత్తి సన్నని నడుమును చూపిస్తూ ప్రైవేట్ పార్ట్స్‌ ఫోకస్ అయ్యేలా తన బాడీలోని కొంత భాగాన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియా అని పేర్కొంటూ ఓ ఫోటో షేర్ చేసింది శ్రీ రెడ్డి. దీంతో పాటు ''నిషిద్ధ ప్రదేశం ఇది.. కానీ రోజూ మీరు కలలోకి వచ్చి..! ఏంటి సంగతి.. ఇంట్లో మీ భార్య మిమ్మల్ని చూసుకోవడం లేదా?'' అని ట్యాగ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఇక శ్రీ రెడ్డి ఇంతలా వయ్యారం ఒలకబోశాక నెటిజన్స్ ఊరుకుంటారా చెప్పండి.. కామెంట్ల రూపంలో తమ లోని భావాలను బయటపెడుతూ రచ్చరచ్చ చేస్తున్నారు.

Related Posts