YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెల్లంపల్లికి పదవీగండం...

వెల్లంపల్లికి పదవీగండం...

విజయవాడ, జనవరి 12
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలకు ఒక మంత్రి బలవ్వక తప్పేట్లు లేదు. వరసగా ఆలయాలపై దాడులు జరుగుతుండటం జగన్ ప్రభుత్వానికి చికాకును కల్గిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఆలయాలకు భద్రతను సమకూర్చాలంటే తలకు మించిన భారం అవుతుంది. సీసీ కెమెరాల ఏర్పాటు కూడా ఖర్చుతో కూడుకున్నదే. సీసీ కెమెరాలను పెట్టినా వాటిని తొలగించి దుండగులు విధ్వంసానికి పాల్పడే అవకాశముందిన పోలీసులు సయితం అంగీకరిస్తున్నారు. ఇక విపక్షాలకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిశ్రీనివాసరావు టార్గెట్ గా మారారు.చిన్నా చితకా ఆలయంలో విధ్వంసాలు కొనసాగుతుండటంతో విపక్షాాలకు అంది వచ్చినట్లయింది. ప్రభుత్వ వైఫల్యంగా విపక్షాలు ఫోకస్ చేస్తున్నాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ భవితవ్యం ఏంటన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. అయితే చంద్రబాబు హయాంలో అయితే ఇప్పటికే మంత్రిపై చర్యలు తీసుకునే వారు. కానీ అక్కడ ఉంది జగన్. వెల్లంపల్లి శ్రీనివాస్ ను తప్పిస్తే ప్రభుత్వం తప్పు చేసినట్లు అవుతుందని ఆయన భావిస్తున్నారు.నిజానికి జరుగుతున్న ఘటనలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నైతికంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. తన శాఖ పరిధిలో జరుగుతన్న సంఘటనలకు ఆయనే కారణమవుతారు. ప్రత్యక్ష్యంగా ఆయన ప్రమేయం లేకపోయినా జవాబు చెప్పాల్సింది మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రమే. దీంతో ఆయనే స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలుగుతారన్న ప్రచారం కూడా ఇప్పుడు ప్రారంభమయింది.వెల్లంపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి తొలిసారి వచ్చింది. ఆయనకు సామాజికవర్గం కోటాలో మంత్రి పదవి దక్కింది. నిజానికి దేవాదాయశాఖను ఎవరూ కోరుకోరు. పనలేని శాఖగానే దానిని భావిస్తారు. అయితే ఇప్పుడు అదే శాఖ ఏపీలో కీలకంగా మారింది. నిత్యం వార్తల్లో నిలుస్తుంది. పైగా ఆయన అశోక్ గజపతిరాజుపై చేసిన వ్యాఖ్యలు క్షత్రియ సామాజికవర్గంలో ఆగ్రహానికి కారణమయింది. మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచే వివాదాలు తలెత్తుతుండటంతో వెల్లంపల్లి శ్రీనివాస్ సయితం మనస్తాపానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి వెల్లంపల్లికి పదవీగండం తప్పేట్లు లేదంటున్నారు.

Related Posts