YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం తెలంగాణ

రాష్ట్రంలో తొలి క‌రోనా టీకా తీసుకున్న కృష్ణ‌మ్మ

రాష్ట్రంలో తొలి క‌రోనా టీకా తీసుకున్న కృష్ణ‌మ్మ

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. వ‌ర్చువ‌ల్ విధానంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌రోనా టీకా ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన అనంత‌రం హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌లిసి ప్రారంభించారు. గాంధీ ఆస్ప‌త్రిలో స‌ఫాయి క‌ర్మ‌చారి ఎస్ కృష్ణ‌మ్మ క‌రోనా టీకా తీసుకున్న తొలి వ్య‌క్తిగా రికార్డులోకి ఎక్కింది. టీకా ఇచ్చిన అనంత‌రం ఆమెతో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆమెను అబ్జ‌ర్వేష‌న్ గ‌దికి త‌ర‌లించారు.

Related Posts