YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధనకార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక థీరుడని కొనియాడారు. ఏ మనిషి అయిన విజయపథంలో నడవాలంటే అకుంఠితదీక్ష ఉండాలనే విషయం ఎప్పుడు చెబుతుండేవారని, ఆయన మాటల్లో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణాజిల్లా ముద్దుబిడ్డ అన్న నందమూరి తారకరామారావు. సినీరంగంలో కృష్ణుడు అయినా దుర్యోధనుడైన ఎన్టీఆరే. దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ పెట్టి 9 నెలల్లో పార్టీ అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు. సమాజమే దేవాలయం పేదవల్లే దేవులు అని చెప్పిన మహానుభావుడని అన్నారు.
పాదయాత్ర లో చైతన్యరథం వెంటనే పెదవాళ్ళు పరిగెడతా ఉంటే వాళ్ల బాధ చూసి 45 రూ పెంక్షన్ పథకాన్ని తీసుకువచ్చారు. ఎన్టీ.రామారావు  తీసుకువచ్చిన సంక్షేమ పధకాలే నేడు ఎందరో ముఖ్యమంత్రిలు అమలు చేస్తున్నారు. రామారావు  పెట్టిన తెలుగు గంగే మద్రాస్ కు నీళ్లు ఇచ్చింది. ఆ మహానుభావుడు స్పూర్తి ప్రజలందరిలో ఉంది. 38 ఏళ్ళు గా రామారావు  పెట్టిన పార్టీ ముందుకు తీసుకువెళ్తున్న అందరికి పేరు పేరు న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  తరువాత  గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు
=========================

Related Posts