YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

రోజుకో రూపంలోకి మారిపోతున్న కరోనా వైరస్!

రోజుకో రూపంలోకి మారిపోతున్న కరోనా వైరస్!

కరోనా వైరస్ రోజుకో రూపంలోకి మారిపోతుంది. ఇప్పటికే పలు దేశాల్లో కొత్త కరోనా వైరస్ లు వెలుగులోకి వచ్చాయి. యూకె లో కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతుంది. ఈ వైరస్ పలు లక్షణాల్లోకి మారుతుంది.  ప్రధాన కరోనా లక్షణాల్లో కంటే ఊహించని అరుదైన కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. అసలు ఈ లక్షణాలను చూస్తే.. కరోనా సోకిందనే విషయం తెలియదు. సాధారణ లక్షణాల మాదిరిగానే కనిపిస్తాయి. కరోనా సోకినవారిలో నోరు నాలుకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని యూకే సైంటిస్టు కింగ్ కాలేజీ లండన్ యూనివర్శిటీకి చెందిన జనెటిక్ ఎపిడిమోలాజిస్ట్ టిమ్ స్పెక్టార్ హెచ్చరికలు చేస్తున్నారు. కరోనా బాధితుల నాలుక ఫొటో ఒకటి షేర్ చేశారు. ఆ ఫొటోలో కరోనా బాధిత వ్యక్తి నాలుకపై అసాధారణ స్థితిలో తెల్లని మచ్చలతో నిండి ఉన్నాయి. దీనికి ఆయన కోవిడ్ టంగ్ అని పేరు పెట్టారు.ఇంగ్లాండ్ లో కరోనా అధికారిక లక్షణాల జాబితాలో ఈ కోవిడ్ టంగ్ అనే లక్షణం లేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా నోటి లక్షణాల జాబితాలో కూడా ఈ లక్షణాన్ని చేర్చలేదన్నారు. అందుకే నోరు నాలుకపై ఇలాంటి అసాధారణ మచ్చలు కనిపిస్తే అది కరోనా అయి ఉండొచ్చునని ఆయన హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వెంటనే బాధితులు సెల్ఫ్ ఐసోలేట్ కావడం మంచిదని సూచిస్తున్నారు. కరోనా లక్షణాల్లో ఇలాంటి అరుదైన లక్షణాలు ఐదుగురిలో ఒకరికి కనిపిస్తోందన్నారు. అతి తక్కువ చర్మవ్యాధుల సాధారణ లక్షణాల్లో ఇదొకటిగా స్పెక్టార్ చెప్పుకొచ్చారు. చూడటానికి అచ్చం మౌత్ అల్సర్లు మాదిరిగానే కనిపిస్తాయని అంటున్నారు.కోవిడ్ సింటమ్స్  స్టడీ యాప్ ద్వారా ప్రొఫెసర్ స్పెక్టార్ కరోనా లక్షణాలు కలిగిన నుంచి వివరాలను సేకరించారు. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్ల మంది కరోనా బాధతుల డేటాను విశ్లేషించారు. కరోనాకు నోరు నాలుకకు సంబంధించి లక్షణాలు కనిపించడం ఇది తొలిసారి కాదు. గత 2020 జూన్లో నోటి అల్సర్లు వంటి సమస్యలతో బాధపడిన వారిలో కరోనా లక్షణాలతో సంబంధం ఉందని గుర్తించారు.

Related Posts