YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బెయిల్ మంజూరు చేసిన పులివెందుల కోర్టు 2018 పులివెందుల పూలంగళ్ల దగ్గర జరిగిన అల్లర్ల కేసులో రిమాండ్

బెయిల్ మంజూరు చేసిన పులివెందుల కోర్టు 2018 పులివెందుల పూలంగళ్ల దగ్గర జరిగిన అల్లర్ల కేసులో రిమాండ్

టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవికి ఊరట లభించింది. ఆయనకు పులివెందుల కోర్టు బెయిలిచ్చింది. దీంతో ఆయన సాయంత్రం విడుదల కానున్నారు. కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాలలో డిసెంబర్ 19న దళిత మహిళ హత్యకు గురైంది. ఈ కేసు విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీటెక్ రవి నేతృత్వంలో టీడీపీ నేతలు పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. అయితే హత్య జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారని.. తమ కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యలు చెప్పారు. అంతేకాదు తమ పరువుకు భంగం వాటిల్లేలా ర్యాలీ నిర్వహించారంటూ ఆరోపించారు.
ఈ విషయంలో హత్యకు గురైన దళిత మహిళ తల్లి పోలీసులకు డిసెంబర్ 22న ఫిర్యాదు చేయడంతో... బీటెక్ రవి సహా 21 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్కైంది. ఈ కేసులో భాగంగా బీటెక్ రవిని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులో తనని అరెస్ట్ చేశారని బీటెక్ రవి అంటుంటే..కాదంటూ ఎస్పీ అన్బు రాజన్ వివరణ ఇచ్చారు. 2018 నాటి ఘర్షణ కేసులో అరెస్ట్ చేసామంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2018 లో పులివెందుల పూల అంగళ్ల వద్ద జరిగిన అల్లర్లు, ఘర్షణలో  బీటెక్ రవి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. లింగాల మహిళ హత్య కేసుకు, ఈ అరెస్ట్కు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ తెలిపారు. కాగా ఆయన అరెస్టును టీడీపీ ఖండించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతుందని పలువురు ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు.

Related Posts