YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమిటీ’పై అపోహలు వద్దు.. సుప్రీం జస్టిస్ బాబ్డే

కమిటీ’పై అపోహలు వద్దు.. సుప్రీం జస్టిస్ బాబ్డే

న్యూ ఢిల్లీ జనవరి 20 
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలపై గత కొంతకాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు రైతుసంఘాల నేతలతో కేంద్రప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నది. రైతుచట్టాలపై ఏర్పడిన సంక్షోభాన్ని తొలగించేందుకు ఓ కమిటీని వేసింది. అయితే ఈ కమిటీపై రైతుసంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రైతుచట్టాలకు అనుకూలంగా మాట్లాడేవాళ్లే.. కమిటీలో సభ్యులుగా ఉన్నారని.. అందుకే తాము అభిప్రాయాలను చెప్పబోమని రైతుసంఘాలు స్పష్టంచేశాయి.
మరోవైపు కమిటీలో సభ్యుడిగా ఉన్న భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ భూపేందర్ సింగ్ మాన్ ఈ కమిటీ నుంచి వైదొలిగారు. అయితే  ఈ కమిటీపై తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ బాబ్డే స్పందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కమిటీపై అనేక అపోహలు ఉన్నాయి. ఈ అపోహలపై ఇప్పుడు చర్చ అనసరం. అయితే కమిటీ నుంచి ఓ సభ్యుడు వైదొలిగారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. రైతుసమస్యలను పరిష్కరించేందుకు కమిటీ వేశాం. ఎవరికైనా సొంత అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ కమిటీ మాత్రం సమస్యపై సమగ్రమైన నివేదిక ఇస్తుందని ఆశిస్తున్నా’ అంటూ ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ కమిటీని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యవసాయచట్టాలకు అనుకూలంగా మాట్లాడిన వారంతా కమిటీలో సభ్యులుగా ఉన్నారని వాళ్లు అంటున్నారు. అంతేకాక జనవరి 26న రైతుసంఘాలు ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం రైతుసంఘాలు సమావేశం కానున్నాయి. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

Related Posts