YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గృహనిర్బంధంలో కన్నా లక్ష్మీనారాయణ

గృహనిర్బంధంలో కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు జనవరి 21 
బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు  గృహనిర్బంధంలో వుంచారు. అయనను డిజిపి కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా నిర్బంధించారు.  కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్నా. అందుకు నిదర్శనమే గృహ నిర్బంధాలు. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో హిందూ ఆలయాల పై దాడులు జరుగుతున్నాయి. దాడులు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రభుత్వాన్ని నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ చాలా ఆదర్శనీయంగా ఉండేది. కానీ వైకాపా నేతలు  చెప్పినట్లు నడుచుకోవాలనటం వల్లే ఈ పరిస్థితి. ప్రభుత్వ చేతకానితనానికి మంత్రులు దూషణలే నిదర్శనం. సంక్షేమ పథకాలు డబ్బులు పంచి మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చని భావిస్తున్నారు. ఇవేవీ వారి సొంత డబ్బులు కావు. నిజమైన ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటారో ఇప్పడు చూస్తున్నాం. విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో ప్రభుత్వం వారం లోగా చెప్పాలి. ప్రభుత్వానికి సమర్ధత ఉంటే అసలు దోషులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేసారు. తప్పించుకునేందుకే బిజేపి పార్టీ పై నేపం వేస్తే  సరిపోదు. ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోందని అయన ఆరోపించారు.

Related Posts