
కార్పోరేట్ వైద్యం ప్రజలకు అందేలా ఉండాలి. ఈ దిశగానే మా ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ రాష్ట్ర అర్ధిక శాఖా మంత్రి హరీశ్ రావు అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తాలూకా స్థాయి వరకు కార్పోరేట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలోను కార్పోరేట్ వైద్య సేవలు గ్రామంలోని పేదలకు అందే విధంగా ఉండాలి. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణ ఖేడ్ వంటి ప్రాంతాల్లోని పేదలకు ఈ ఆస్పత్రి వైద్య సేవలు అందించాలి. ఆరోగ్య శ్రీ కింద పేదలకు ఉచిత వైద్యం అందించాలి. వైద్య రంగం వ్యాపారం కాకూడదు. ఇంత ఖర్చు పెట్టి వైద్యాలయం ఏర్పాటు చేసినందుకు లాభం రావాలి. కాని లాభాపేక్ష తోనే ఆస్పత్రులు నిర్వహించవద్దు. సామాజిక బాధ్యతతో వైద్య సేవలు అందించినపుడే సార్థకత చేకూరుతుందని మంత్రి అన్నారు.