YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలి

స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలి

రాష్ట్ర ఎలెక్షన్స్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  శుక్రవారం నాడు అనంతపురం జిల్లాలో ఎలెక్షన్స్ కమిషనర్ రెండు గంటలు పాటు అధికారులుతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఎలెక్షన్స్ ఏర్పాట్లు పై అధికారులు కమిషనర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాటలాడుతూ ఐదు రెవెన్యూ డివిజన్స్ గాను నాలుగు ఫేజ్లుగా  జిల్లా ఎలెక్షన్స్ జరుగుతున్నాయి. మొదటి ఫేజ్ కదిరి డివిజన్ లో 169 పంచాయితీలకు  నామినేషన్ ప్రక్రియ మొదలైంది 1044 పంచాయతీలకు ఎలెక్షన్స్ జరుగుతున్నాయి.  జిల్లా వ్యాప్తంగా 11030 పోలింగ్ స్టేషన్స్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసాము. 30శాతం సమస్యాత్మక ప్రాంతాలును గుర్తించాం.గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని పంచాయతీ ఎన్నికలకు ఆ అధికారులను తప్పించాం. ఎలెక్షన్స్ కమిషనర్ ప్రోటో కాల్ ప్రకారం జిల్లాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు.
నిమ్మగడ్డ  మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ అనంతపురం జిల్లా ముందు ఉంది. జిల్లా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు జరగడం వల్ల నిధులు తోపాటు అభివృద్ధి పథంలో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఈ ఎన్నికల రాష్ట్ర సిబ్బంది తోనే నిర్వహిస్తాము కేంద్ర బలగాలు దూరదృష్టతోనే కేంద్రముకు అప్పీల్ చేసాం. అనంతపురం జిల్లా పెద్దది కావడంతోనే అంతర రాష్ట్రలు ఉండడంతో ముందుగా అనంతపురం జిల్లాకు వచ్చాను. రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా అవ్వుతున్నాయి అని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి రాయలసీమ జిల్లాలు పర్యటన చేపట్టాను. ఏకగ్రీవాలు కావాలని ఒత్తిడి తెస్తున్నారు...యాడ్స్ ఇవ్వడం పైన  ఐ అండ్ పీఆర్  డిపార్ట్మెంట్ ను అడిగాను. ఏకగ్రీవాలు వత్తిడి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా షాడో టీమ్స్ ఏర్పాటు చేయని కలెక్టర్ ఎస్పీ ఎన్నికల కమిషనర్ చెప్పింది. ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరుగుతున్నాయి జరుగుతాయి నమ్ముతున్నానని అన్నారు.  మరోసారి కూడా ఎన్నికలు సమీక్ష కోసం జిల్లా పర్యటన చేస్తాను. పంచాయతీ ఎన్నికలు జరుగుడానికి కాల్ సెంటర్ అదే విదంగా డిజిటల్ రూపంలో యాప్ తీసుకొచ్చామని అన్నారు.
 

Related Posts