YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ప్రోద్దుటూరులో ఉద్రిక్తత

ప్రోద్దుటూరులో ఉద్రిక్తత

కడప జిల్లా ప్రొద్దుటూరులోని కూరగా యల మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.కమిషనర్ ఆదేశాల మేరకు.. కూరగాయల మార్కెట్ ను కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. వ్యాపారస్తుల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ జివి.ప్రవీణ్ కుమార్ రెడ్డి కూల్చివేత పనులను అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులను ఇవ్వకుండానే మున్సిపల్ అధికారులు మార్కెట్ ను అక్రమంగా కూల్చేస్తున్నారని వ్యాపారస్థులు వాపోయారు.ప్రొద్దుటూరు మార్కెట్ ను కూల్చివేసి, తిరిగి నూతనంగా షాపులను నిర్మిస్తామని, అంతవరకు వ్యాపారస్తులకు షెల్టర్లను నియమిస్తామని ఎంఎల్ ఎ తెలిపారు. ఇందుకు కొందరు వ్యాపారస్తులు, కొన్ని పార్టీల నేతలు అంగీకరించలేదు. ఈ రోజు అకస్మాత్తుగా మార్కెట్ ను కూల్చివేసే చర్యలు అధికారులు చేపట్టడంతో మార్కెట్ వద్దకు చేరుకున్న సిపిఐ, టిడిపి, బిజెపి శ్రేణులు అక్కడే బైఠాయించి నిరసన చేపట్టాయి. ఉద్రిక్తతల నడుమ ఆందోళన స్థలానికి పోలీసులు భారీగా మోహరించారు.

Related Posts