YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దాం మహాత్ముని ఆశయ సాధనకు టీడీపీ కట్టుబడి పని చేస్తోంది నారా చంద్రబాబు నాయుడు

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దాం మహాత్ముని ఆశయ సాధనకు టీడీపీ కట్టుబడి పని చేస్తోంది నారా చంద్రబాబు నాయుడు

విజయవాడ 
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా  ఆయన చిత్రపటానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాలులర్పించారు. గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే ప్రతి పల్లె స్వయం సమృద్ధిని సాధించాలి. పల్లెల్లో ప్రశాంతత నెలకొనాలి. కానీ ఈ ప్రభుత్వ పాలనలో రాత్రికి రాత్రి ప్రజలను విభజిస్తూ గోడలొస్తున్నాయి. కక్షలు, కార్పణ్యాలు, కబ్జాలు, ఆక్రమణలు, ఆక్రందనలతో పల్లెలు అల్లాడుతున్నాయి. దేశం కోసం తన జీవిత సర్వస్వాన్నీ, ప్రాణాలను అర్పించిన గాంధీజీ ఆశించిన పల్లెలు ఇవేనా అనే అనుమానం కలుగుతోంది. పల్లెలు మళ్ళీ వెలగాలి. అప్పుడే దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ప్రాణ త్యాగలకు అర్ధముంటుంది. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆ మహాత్ముని స్మృతికి నివాళులర్పించుకుందాం. గ్రామ స్వరాజ్యాన్ని, సమైక్య భారతాన్ని ఆవిష్కరించుకోవడంలో మన పాత్రను పోషిద్దాం. బాధ్యత కలిగిన పౌరుడిగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కును వినియోగించుకుందాం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలనే మహాత్ముని పిలుపును స్మరించుకుంటూ గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించుకుందాం. గ్రామాల ఐక్యత, అభివృద్ధి, పచ్చదనం పెంపొందించుకునేందుకు అందరం నడుం బిగిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో.. మెరుగైన నాయకత్వాన్ని బలపరచుకుందామని అయన అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ 20 నెలల్లో జరిగిన హింస విధ్వంసాలపై ప్రజలే ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తీర్పు ఇవ్వాలి. గ్రామాల అభివృద్ధి, పల్లె ప్రగతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు ప్రజల కళ్లెదురుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి రోడ్లు, బురదతో అవస్థలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో 25వేల కిలోమీటర్లకు పైగా సిమెంటు రోడ్లు ఏర్పాటయ్యాయి. చీకట్లను తరిమేయడమే ధ్యేయంగా ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం కోసం లక్షలాది పంటకుంటలను ఉపాధి హామీ నిధులతో తవ్వించి పంటలకు వర్షాభావం సమస్యగా మారకుండా చేశాం. గ్రామాల అభ్యున్నతికి తెలుగుదేశం ఎప్పటికీ అండగా నిలిచింది. నిలుస్తుంది కూడా అని అన్నారు. .
ఈ మేరకు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,  ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, రాష్ట్ర అధికార ప్రతినిధులు పిల్లిమాణిక్యరావు, సయ్యద్ రఫీ, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, వల్లూరి కుమార స్వామి, దేవతోటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts