YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంకా వీడనీ సస్పెన్స్

ఇంకా వీడనీ సస్పెన్స్

తిరుపతి, ఫిబ్రవరి3  
తిరుపతి ఎన్నికల్లో జనసేన కు ఛాన్స్ కమలం ఇస్తుందా లేదా. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. అక్కడ సీటు ఖాళీ అయిన రోజు మొదలు కమలనాధులు అనేక వ్యూహాలతో తిరుపతిని చుట్టుముట్టేస్తూ వస్తున్నారు. అంతే కాదు బిజెపి – జనసేన ప్రకటించే అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం మొదలు పెట్టింది కూడా. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి తప్పుకున్నందుకు తిరుపతి సీటు తమకు కేటాయించాలని పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా కోరుతున్నారు.బిజెపి అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ కి తిక్క లేచాలా ఇప్పటివరకు దీనిపై కమలం నిర్ణయం తీసుకోలేదు. దాంతో అప్పుడప్పుడు ఆయన అసహనం సైతం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బిజెపి తో సీటు విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతోందంటూ కూడా పవన్ కల్యాణ‌్ వ్యాఖ్యానించడం గమనిస్తే ఆయన ఇక ఓపిక పట్టేందుకు సిద్ధంగా లేనట్లే తెలుస్తుంది. ఈ సీటు లెక్క వచ్చే వారం లోగా తేల్చేస్తామంటూ కూడా పవన్ కల్యాణ్ చెప్పుకోవాలిసివచ్చింది.తిరుపతి లోక్ సభ సీటు వదులుకోవడానికి తమ పార్టీ సిద్ధమేనని అయితే ఆ స్థానం నుంచి పవన్ కల్యాణ్ సరైన అభ్యర్థిని బరిలోకి దింపి గెలుస్తామంటేనే అన్న మెలికను పెట్టాలని కమలం ఆలోచనగా ఉన్నట్లు హస్తిన వర్గాల్లో టాక్. ఈ ప్రతిపాదనకు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చే అవకాశం ఉండదన్నట్లుగా కాషాయం వ్యూహం రచిస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ను ఇరుకున పెట్టి తిరుపతి లో పోటీకి దిగేందుకు తమ ఎత్తుగడ పనికొస్తుందని అయితే ఇది ఒక ఎత్తుగడ మాత్రమే అని కొందరంటున్నారు. మరో వైపు చెప్పాలిసిన వారితో చెప్పాలిసిన విధంగా నచ్చ చెబితే జనసేన పక్కకు తప్పుకుంటుందని మరికొందరు చెబుతూ ఉండటం తో తిరుపతి లోక్ సభ స్థానం లో పోటీ పై ఈ రెండు ప్రధాన పార్టీల నడుమ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. చూడాలి మరి ఏమి జరగనుందో. 

Related Posts