YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికలు..ఎవరికి లబ్ది

ఎన్నికలు..ఎవరికి లబ్ది

విజయవాడ, ఫిబ్రవరి 4, 
పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికల నిర్వహణకు సిద్దమౌతున్నారు. కాగా గతంలో సగంలో ఆగిపోయిన జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను పూర్తి చేయకుండా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వడంలో కుట్ర ఉందని అధికార పక్షం వైసిపి ఆరోపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ టిడిపికి లబ్ధి చేకూర్చేందుకే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ తెచ్చారని వైసిపి ఆరోపించింది. అయితే గతంలో మధ్యలో నిలిచిపోయిన జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను తిరిగి ప్రారంభిస్తే ప్రతిపక్ష పార్టీలు నిమ్మగడ్డకు సహకరించే అవకాశం లేదు. ఆ పార్టీలు ఆ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలన్నింటినీ రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. టిడిపి, బిజెపి, సిపిఐ ఇదే డిమాండ్లను చేస్తున్నాయి. అప్పుడు కొన్ని ఏకగ్రీవాలు వివాదస్పదం కావడంతో ప్రతిపక్ష పార్టీలు, అభ్యర్ధులు హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసు హైకోర్ట్‌లో పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ప్రకటించిన ఏకగ్రీవాలను కొట్టివేసే అధికారం ఒక్క కోర్టుకు మాత్రమే ఉంది. ఏకగ్రీవాలు అయినప్పటికీ డిక్లేర్డ్‌ చేయని కొన్నింటిని మాత్రం అప్పట్లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పెండింగ్‌లో పెట్టారు. వాటిని తిరిగి నిర్వహించే అధికారం నిమ్మగడ్డకు ఉంటుంది. కానీ ఈ ఎన్నికలను ముందు జరపడం కన్నా పంచాయతీ ఎన్నికలు ముందు జరిపితే అన్ని పార్టీలు సహకరిస్తాయని ఎస్‌ఇసి భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం టిడిపికే లబ్ది చేకూరుస్తుందని వైసిపి ఆరోపిస్తోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు... పార్టీలతో సంబంధం లేకుండా రెండు గ్రూపులుగా విడిపోతారని, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న గ్రూపు సహజంగానే టిడిపి పంచన చేరుతుందని, దీంతో టిడిపికి అదనపు బలం చేకూరుతుందని వైసిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరిగితే అప్పటికే గ్రూపులుగా చిలీన ప్రజలు ఆ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసే ప్రమాదముందని, ఇది ఒక రకంగా టిడిపికి లబ్ది చేకూర్చడమేనని భావిస్తోంది. అలా కాకుండా జెడిపిటిసి, ఎంపిటిసి ఎన్నికలే ముందుగా జరిగితే పార్టీల సింబల్స్‌ పైన జరుగుతాయని, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాల కారణంగా ప్రజల్లో అత్యధిక భాగం తమ పార్టీకే ఓటు వేస్తారని వైసిపి అంటోంది. కానీ అదే పంచాయతీ ఎన్నికలు జరిగే రెండు వర్గాలుగా ప్రజలు చీలిపోవడం వల్ల కొంత ఓటుబ్యాంక్‌ దెబ్బతినే అవకాశముంటుందని భావిస్తోంది. కాగా పంచాయతీ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయిన నేపథ్యంలో టిడిపి దూకుడు పెంచింది. పార్టీ రహితంగా ఎన్నికలు జరగుతున్నప్పటికీ అన్ని పంచాయతీల్లోనూ టిడిపి అభ్యర్దులు నామినేషన్‌ వేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కిందిస్థాయి వరకు తీసుకెళ్లి పార్టీ కేడర్‌ను అన్ని పంచాయతీల్లో యాక్టివేట్‌ చేయాలని పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు సందేశాలను పంపింది.

Related Posts