YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

యాప్ ను ఆపండి

యాప్ ను ఆపండి

విజయవాడ, ఫిబ్రవరి 5,
ఏపీ ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల కోసం తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 9 వరకు యాప్ అమల్లోకి తీసుకురావొద్దని ఆదేశించింది. యాప్‌కు సంబంధించి భద్రతా ధ్రువపత్రం అందలేదన్న ప్రభుత్వ న్యాయవాది.. దీనికి ఇంకా ఐదు రోజులు సమయం పట్టు అవకాశం ఉందన్నారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ నెల 3న ఎన్నికల సంఘం ఈ-వాచ్ యాప్‌ను ప్రారంభించింది.ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన కోర్టు లంచ్ మోషన్‌కు నిరాకరించి శుక్రవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఈ-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని.. ఎస్ఈసీ ఇంతకుముందు వాడే యాప్ స్థానంలో కొత్త యాప్ వాడుతున్నారని ప్రభుత్వం పిటిషన్‌లో ప్రస్తావించింది. యాప్‌ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం కోరింది.ఏపీ ఎస్ఈసీ ఈవాచ్ పేరుతో కొత్త యాప్ తీసుకొచ్చింది. పాత యాప్ స్థానంలో కొత్తగా దీనిని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ యాప్‌ను ఈ నెల3న నిమ్మగడ్డ రమేష్ ఆవిష్కరించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ప్రత్యేకంగా యాప్‌ తీసుకొస్తున్నట్లు ఎన్నికల కమిషనర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార నిమిత్తం ఏర్పాటుచేస్తున్న కాల్‌ సెంటర్‌ని కూడా ప్రారంభించారు. ఈ యాప్‌ను ప్రభుత్వం తప్పుబడుతోంది.

Related Posts