YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 ట్రయిల్ రన్ కు రెడీ అవుతున్న సీతారామా

 ట్రయిల్ రన్ కు రెడీ అవుతున్న సీతారామా

 ట్రయిల్ రన్ కు రెడీ అవుతున్న సీతారామా
ఖమ్మం, ఫిబ్రవరి 6,
 ఖమ్మం జిల్లా వరప్రదాయని సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్‌ రన్‌ను ఈ ఏడాది జూన్‌లోగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పథకాన్ని ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడాది జూన్‌లోగా సత్తుపల్లి లింక్‌ కెనాల్‌ను పూర్తి చేసినట్లయితే మూడో పంప్‌హౌజ్‌ ట్రైల్‌ రన్‌కు మార్గం సుగమం కానున్నది. సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌లో జరిగిన వర్క్‌షాపులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించి అధికారులు నిర్దేశిత గడువు విధించారు. సత్తుపల్లి లింక్‌ కెనాల్‌ను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ట్రైల్‌ రన్‌కు మూడో పంప్‌హౌజ్‌ నుంచి నీటిని తరలించేందుకు అవకాశం ఏర్పడనున్నది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద  పంప్‌హౌజ్‌ ఉన్న పంప్‌ హౌజ్‌ వద్ద మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని తీర్మానించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణమవుతున్న పారెస్టు భూముల సమస్యల పరిష్కారానికి కార్యాచరణపై చర్చించారు. ఆయా శాఖల అధికారులతో సంప్రదించి సమస్యలు రాకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడో పంప్‌హౌజ్‌ ట్రయల్‌ రన్‌ ద్వారా సత్తుపల్లి ప్రాంతంలోని బేతుపల్లి, లంకాసాగర్‌ తదితర చెరువులను నింపాలని నిర్ణయించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు వెంటనే టెండర్ల పిలవడం ద్వారా పనులు ప్రారంభించేలా ముందుకు సాగుతున్నారు. ఇల్లెందు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు మార్చిలోగా డీపీఆర్‌ ఇవ్వాలని తీర్మానించారు. సుమారు రూ.8వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు 2018 ఫిబ్రవరి 16 శంకుస్థాపన చేశారు. కరోనా, లాక్‌డౌన్‌తో ఈ ప్రాజెక్టు పనులు కాస్త నెమ్మదించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ గత నెల 21న ప్రత్యేకంగా సమీక్షించారు. ఏడాదిలోగా సీతారామ పనులు పూర్తి చేయాలని  నిర్ణయించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలు రైతులకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరందించనున్నారు. భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండు ఫేజ్‌లుగా నిర్మిస్తున్నారు. మొదటి ఫేజ్‌లో 6.74 లక్షల ఎకరాలకు, రెండో ఫేజ్‌లో 3.26 లక్షల ఎకరాలకు సీతారామ ద్వారా సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గొదావరిపై నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపనున్నారు. ఈ ప్రక్రియలో 9 వేల క్యూ సెక్కుల నీటి ప్రవాహం, గ్రావిటీ కెనాల్‌ పొడవు 243.2 కి.మీటర్లు పొడవున 4 పంప్‌హౌజ్‌లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 8 ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. 

Related Posts