YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫెడ్యూల్

త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫెడ్యూల్

త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫెడ్యూల్
విజయవాడ, ఫిబ్రవరి 6 
త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందా.. ఎస్ఈసీ ఆ దిశగా పావులు కదుపుతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. రేషన్ వాహనాల వినియోగం ఆంక్షలపై ఇచ్చిన ఆదేశాల్లో ఈ ప్రస్తావన వచ్చింది. 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయ్యేంత వరకూ రంగులు మార్చిన రేషన్ సరఫరా వాహనాలే వినియోగించాలని ఎస్ఈసీ సూచించింది. దీంతో ఎన్నికలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెల 20 తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ 
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.ఎస్ఈసీ రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించిన వాహనాల రంగులను వెంటనే మార్చాలని ఆదేశించారు. వాహనాలపై అధికార వైఎస్సార్‌సీపీజెండాకు
సంబంధించిన రంగులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని రంగులు వేసి రేషన్ డోర్ డెలివరీ వాహనాలు తిప్పాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు గ్రామాల్లో 
వాహనాలతో రేషన్‌ పంపిణీ నిలిపివేయాలని తేల్చి చెప్పారు. రంగులు మార్చాకే వాహనాల ద్వారా పంపిణీకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం ఈ వాహనాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రేషన్ 
వాహనాలకు సంబంధించిన ఆదేశాల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది.

Related Posts