YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా అక్రమాలపై న్యాయపోరాటం - చంద్రబాబు నాయుడు

వైకాపా అక్రమాలపై న్యాయపోరాటం - చంద్రబాబు నాయుడు

విజయవాడ ఫిబ్రవరి 8  
చిత్తూరు జిల్లా పుంగనూరు తెలుగుదేశం నాయకులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు టెలీకాన్పెరెన్స్ నిర్వహించారు. వైకాపా ఎన్నికల అక్రమాలను స్థానిక నేతలు  అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమల మండలాలలో తెదేపా బలపరిచిన అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైకాపా అడ్డుకుంటోంది. నామినేషన్లు వేయకూడదంటూ అభ్యర్ధులను పోలీసు అధికారులే బెదిరిస్తున్నారు. సోమల మండల ఎస్సై లక్ష్మీకాంత్, సదుం ఎస్సై పి. ధరణిధర్, రొంపిచర్ల ఎస్సై ఏ. హరిప్రసాద్, సిఐ మధసూధన్ రెడ్డి ఏకపక్షంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ టిటిడి బోర్డ్ మెంబర్ చల్లా రామచంద్రారెడ్డి, సోమల మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు, పుంగనూరు టౌన్ అధ్యక్షుడు ఎం. మస్తాన్, రొంపిచర్ల మండలాధ్యక్షుడు యు. రమణ లతో పాటు 26 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు.
పులిచర్ల మండలంలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మీ-సేవలో అప్లై చేసిన వారి ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారు. ఎన్నికల అక్రమాలకు దాడులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యత వహించాలి. ఎన్నికల కమీషనర్, డిజిపీ పుంగనూరు అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. వీటిన్నిటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నాయకులకు  చంద్రబాబు సూచించారు. వైకాపా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేద్దామని నాయకులకు భరోసా ఇచ్చారు.

Related Posts