YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ ను నంబర్ వన్ చేయడమే లక్ష్యం మంత్రి హరీష్ రావు 

తెలంగాణ ను నంబర్ వన్ చేయడమే లక్ష్యం మంత్రి హరీష్ రావు 

తెలంగాణ ను నంబర్ వన్ చేయడమే లక్ష్యం
మంత్రి హరీష్ రావు 
సంగారెడ్డి  ఫిబ్రవరి 10  
తెరాస వచ్చాక మంచినీటి బాధ లేకుండా చేసింది. టీడీపీ ఉండగా పవర్ బిల్లులు ముక్కు పిండి వసూలు చేశారు. విద్యుత్ మాత్రం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ అని చెప్పి ఉత్త విద్యుత్ ఇచ్చారని మంత్రి హరీష్ రావు అన్నారు.  సంగారెడ్డి జిల్లా  కంది మండలం చిదురుప్ప గ్రామంలో రైతు వేదికను అయన బుధవారం ప్రారంభించారు. మంత్రికి గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో , సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లడుతు 
సీఎంగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అర్థరాత్రి దొంగ కరెంటు ఇచ్చారు. ఆనాడు  రైతు చనిపోతే రూపాయి ఇవ్వలేదు. కాని రైతు చనిపోతే ఐదు లక్షల బీమా మొత్తం రైతు ఇంటికి పంపుతున్నాం. రైతు బంధుకు 700 కోట్లు ఒక్క సంగారెడ్డికి ఇచ్చాం. కొద్ది మంది తెరాస ఏం చేసిందని అడుగుతున్నారు. ఉచిత కరెంటు, రైతుకు పెట్టుబడి సాయం పది వేలు ఇచ్చాం. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి. ఇలా ఎంతో చేశాం.  రైతుకు వ్యవసాయ పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సీఎం యోచన చేస్తున్నారు.రైతు బాగు కోసం సీఎం నిత్యం ఆలోచిస్తున్నారు. తెలంగాణ వచ్చాక రెండు కోట్ల ఎకరాలు ఏడాది సాగు అవుతోందని మంత్రి అన్నారు. సంప్రదాయ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. ఇరవై లక్షల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు పెంచాల్సిన అవసరం ఉంది. కూరగాయలు సాగు, పండ్లతోటల సాగు లాభదాయకం. తెలంగాణ వచ్చాక సంగారెడ్డిలో  200 కోట్ల రోడ్ల పనులు.వచ్చాయి. తెలంగాణ ను నంబర్ వన్ చేయడమే లక్ష్యమని అయన అన్నారు.

Related Posts