YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి కేటీఆర్ తో తెరాస కార్పోరేటర్ల భేటీ సీల్డ్ కవర్ లో మేయర్, ఉప మేయర్ల పేర్లు

మంత్రి కేటీఆర్ తో తెరాస కార్పోరేటర్ల భేటీ సీల్డ్ కవర్ లో మేయర్, ఉప మేయర్ల పేర్లు

మంత్రి కేటీఆర్ తో తెరాస కార్పోరేటర్ల భేటీ
సీల్డ్ కవర్ లో మేయర్, ఉప మేయర్ల పేర్లు
హైదరాబాద్ ఫిబ్రవరి 10 
గురువారం జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ నేపధ్యంలో ఉదయం ఎనిమిదిన్నరకు తెలంగాణ భవన్ లో టీఆరెస్ఎస్  కార్పోరేటర్ల తో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. సీల్డ్ కవర్ లో టీఆరెస్ మేయర్ డిప్యూటీ మేయర్ పేర్లు వుంటాయని సమాచారం. డైరెక్ట్ గా జిహెచ్ఎంసి ఆఫీస్ లోనే సీల్డ్ కవర్ ను  ఓపెన్ చేయనున్నారు. మేయర్ ఎన్నికలో పాల్గొన్న కార్పొరేటర్ ల లో 50శాతం కోరం వుండాలి. 50 శాతం కౌన్సిల్ సమావేశంలో ఎవ్వరికీ ఎక్కువ ఉంటే వాళ్ళకే మెజారిటీ దక్కుతుంది. 194 మొత్తం సభ్యుల్లో 50శాతం కోరం ఉండాలి. బీజేపీ పోటీలో ఉన్న నేపథ్యంలో 50శాతం కోరం ఉంటుందన్న టీఆరెస్. ఎక్స్ అఫిషియో లో ఎంఐఎం 10, టీఆరెస్ 32, బిజెపి 2 స్థానాలున్నాయి.  కౌన్సిల్ సమావేశానికి ముందు అధికార పార్టీ  విప్ జారీ చేయనుంది. ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఆరెస్ మేయర్- డిప్యూటీ మేయర్ నామినేషన్ దాఖలు చేస్తారు. 

Related Posts