YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

 గ్రామపంచాయితిలలో మొక్కలను నాటడం మాత్రమే కాదు,వాటిని సంరక్షించాలి జిల్లా కలెక్టర్ జి. రవి

 గ్రామపంచాయితిలలో మొక్కలను నాటడం మాత్రమే కాదు,వాటిని సంరక్షించాలి జిల్లా కలెక్టర్ జి. రవి

 గ్రామపంచాయితిలలో మొక్కలను నాటడం మాత్రమే కాదు,వాటిని సంరక్షించాలి
జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల ఫిబ్రవరి 10
 రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్బంగా,  రాష్ట్రంలో చేపట్టనున్న కోటివృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామపంచాయితిలో
వేయ్యి మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  
బుధవారం ఉదయం గ్రామపంచాయితిలలో 
వేయ్యి మొక్కల నాటే కార్యక్రమంపై  అధికారులతో జూమ్  కాన్పరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయితిలో వేేయ్యి మొక్కలు నాటడానికి మండలలా మరియు గ్రామాల వారిగా ప్రణాళికను సిద్దంచేసుకొని నివేధికను పంపించవలసిందిగా ఆదేశించారు.  గ్రామపంచాయితిలో 30 సెంటి మీటర్లకు పైబడి ఉన్న వేయ్యి మొక్కలను మాత్రమే ఖచ్చితంగా నాటాలని, మొక్కలు అందుబాటులో లేనట్లయితే గ్రామపంచాయితి గ్రీన్ బడ్జెట్ నుండి కొనుగోలు చేయాలని సూచించారు.   కార్యక్రమ నిర్వహణ కొరకు ముందస్తుగానే అవసరమైన అన్ని ఏర్పట్లను సమకూర్చుకొవాలని,  అందులో బాగంగా 16వ తేది.లోగా 45 క్యూబిక్  సెంటిమీటర్ల సైజు గల గుంతలను ఏర్పాటు చేసుకొని, వాటరింగ్ ను ఏర్పాటు చేయాలని, మరుసటి ఉదయం 10 గంటలకు సైరన్ ఏర్పాటు చేసుకొని మొక్కలను నాటుకొనే కార్యక్రమాన్ని ప్రారంభించి 11 గంటల వరకు నిర్వహించాలని సూచించారు.  కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యంపిడిఓ, యంపిఓలు, పంచాయితి సెక్రటరిలు, సర్పంచులు,యంపిటిసి, స్థానిక ప్రజలను, వివిధ కమీటిలు, యువతను బాగస్వాములను చేసి, ముందుస్తూ సమావేశాలు నిర్వహించుకొని కావలసిన అవసరాలను సమకూర్చుకోవాలని, యాక్షన్ ప్లాన్ తయారుచేసుకొని నేటి సాయంత్రంలోగా నివేదికను పంపించాలని అన్నారు. మొక్కలను నాటడానికి స్థలాలను గుర్తించుకొని, అందరు ఒకే చోట కాకుండా గృపులుగా ఏర్పడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని,  గంటలోనే 
వేయ్యి మొక్కలు నాటడానికి ప్రణాళికను రూపొందించుకొని కార్యక్రమాని విజయవంతం చేయాలని,  సైరన్ ఇచ్చిన వెంటనే కార్యక్రమాన్ని కచ్చితంగా ప్రారంబం కావాలని అన్నారు.  గీన్ బడ్జెట్ వివరాలను ప్రత్యేక అధికారులకు తెలియజేయాలని అన్నారు.  మొక్కలను నాటడానికి అవసరమైన కూలీలను ఏర్పాటు చేసుకోవాలని, వేయ్యి
 మొక్కలు ఓకే చోట ఏర్పాటు చేసినట్లయితే వాటి సంరక్షణ కొరకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొవాలని,  నాటిన ప్రతి మొక్క సరిగా నాటడం జరిగిందా, సాసరింగ్ ఏర్పాటు, ట్రిగార్డ్, సపోర్ట్ కర్రలను ఏర్పాటు సరిగా చేయడం జరిగిందా సరిచూసుకొవాలని,  కార్యక్రమ అనంతరం ప్లాస్టిక్ కవర్లు లేకుండా చర్యలను ఏర్పాటు చేసుకోవాలని, నాటిన ప్రతిమొక్కకు నీరు అందేలా చర్యలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  పెద్దగా పెరిగే మొక్కలకు మాత్రమే ఎక్కువ ప్రాదాన్యం ఇచ్చి జిల్లాలో 3,80,000 లక్ష్యాన్ని సాధించాలని అన్నారు.  కార్యక్రమంతో పాటు  పల్లెప్రగతి, సానిటేషన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని అన్నారు. 
ఈ కార్యక్రమంలో అధనపు కలెక్టర్ బి. రాజేషం, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్  అరుణశ్రీ,  జిల్లాపరిషత్ సిఈఓ శ్రీనివాస్, పిడి డిఆర్డిఓ లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేక అధికారులు, యంపిడిఓలు, యంపిఓలు,  తదితరులు పాల్గోన్నారు.

Related Posts